ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: దేశమంతా ఏపీ వైపు తలతిప్పి తిరిగి చూసేలా చేశా

ABN, Publish Date - Mar 15 , 2025 | 08:21 AM

12వ ఆవిర్భావ సభ వేళ పిఠాపురం ‘జయ కేతనం’ ఎగురవేసింది. తండోపతండాలుగా వచ్చిన జనంతో చిత్రాడలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఈ సభలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.

1/10

12వ ఆవిర్భావ సభ వేళ పిఠాపురం ‘జయ కేతనం’ ఎగురవేసింది. తండోపతండాలుగా వచ్చిన జనంతో చిత్రాడలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఈ సభలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.

2/10

ఈ సభలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేవని మనల్ని చాలెంజ్‌ చేసి.. చరచిన ఆ తొడల్ని బద్దలుకొట్టామని అన్నారు.

3/10

అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతో అడుగుపెట్టానని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

4/10

దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా వందశాతం స్టైక్‌రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టామని పవన్ కల్యాణ్ అన్నారు.

5/10

2014లో జనసేన స్థాపించానని.. తనకు ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

6/10

తాను ఓడినా ఒక అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం.. నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టామని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

7/10

మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు.. జబ్బలు చరిచారు.. తొడలు కొట్టారు.. ఆడపడుచులను అవమానించారు..ప్రజలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే గొంతెత్తిన వారిపై కేసులు పెట్టారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

8/10

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

9/10

టీడీపీ కార్యకర్తలు, సీనియర్‌ నాయకులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడేలా వైసీపీ నేతలు చేశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

10/10

తనను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదని, ఎన్నో అవమానాలకు గురిచేశారని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేయని కుట్ర లేదు.. వేయని కుతంత్రం లేదని వైసీపీ నేతలపై మండిపడ్డారు.

Updated Date - Mar 15 , 2025 | 08:26 AM