Lokesh Inaugurates VR School: సౌతిండియాలోనే ఇలాంటి స్కూల్ లేదు: లోకేష్
ABN, Publish Date - Jul 07 , 2025 | 05:40 PM
Minister Lokesh inaugurates VR Model School: ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ నెల్లూరులో వీఆర్ మోడల్ హైస్కూల్‌ను ప్రారంభించారు. 6 నెలల క్రితం మూతపడిన పాఠశాలను అత్యాధునిక రీతిలో ఇంత వేగంగా తీర్చిదిద్దడం అద్భుతమని ప్రశంసించారు.
నెల్లూరులో వీఆర్ మోడల్ పాఠశాలను ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల ఆరు నెలలు కిందట మూతపడగా మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి అద్భుతంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా కొనియాడారు.
సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితిలో ఉన్న స్కూలు ఇప్పుడే చూస్తే ఆశ్చర్యంగానూ, అసూయగానూ ఉందని మంత్రి లోకేష్ చమత్కరించారు.
వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానం పరిశీలన సందర్భంగా సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడిన మంత్రి లోకేష్.
పాఠశాల ల్యాబ్ ను పరిశీలిస్తున్న మంత్రులు
వెంకటేశ్వర్లు, పెంచలయ్యతో ముచ్చటిస్తున్న లోకేష్
అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ క్లాస్ రూములు
తరగతి గదిలో సౌకర్యాలపై ఉపాధ్యాయినితో చర్చిస్తున్న మంత్రి
లైబ్రరీలో పుస్తకాలను పరిశీలిస్తున్న మంత్రి
వీఆర్ హైస్కూల్లో విద్యార్థుల కోసం మినీ థియేటర్ ఏర్పాటు.
పాఠశాల ఆవరణను మంత్రులతో కలిసి పరిశీలన
పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 09:23 PM