CM Chandrababu: రాజంపేటలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 02 , 2025 | 07:15 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో పర్యటించారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేడర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(సోమవారం) అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో పర్యటించారు.
రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు.
సీఎం చంద్రబాబును ఫొటోలు తీస్తున్న చిన్నారులు
వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం చంద్రబాబు
పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సీఎం మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు
పేదల ఆత్మగౌరవం, సాధికారత, ఆర్థిక భద్రతే లక్ష్యంగా సామాజిక పింఛన్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు తోడ్పడే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెలా తాను స్వయంగా పాల్గొంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Sep 02 , 2025 | 07:19 AM