ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఆటో డ్రైవర్ డ్రెస్‌లో సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్

ABN, Publish Date - Oct 04 , 2025 | 05:33 PM

విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతియేడాది ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం అందించనుంది.

1/7

విజయవాడ సింగ్‌నగర్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతియేడాది ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు అందించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం ఆటో డ్రైవర్ల డ్రెస్‌లు ధరించి కనువిందు చేశారు.

2/7

‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకంలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేవ్ ఆటో డ్రైవర్లకు చెక్కులు అందజేశారు.

3/7

‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకంలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రసిగించారు. ఈరోజు ఆటో డ్రైవర్‌ల పండుగలో ఉన్నాం. ఆయుధ పూజ తరహాలో వాహన పూజ చేశారు. ఆటో డ్రైవర్‌లు పేమెంట్లు అన్ని సెల్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. చెప్పిన రోజు చెప్పినట్లుగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

4/7

ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా ప్రకాశం బ్యారేజీ లోటాస్ నుంచి సీఎం చంద్రబాబు ఆటోలో ప్రయాణికులతో ప్రయాణించి వారితో ముచ్చటించారు.

5/7

సెల్‌ఫోన్లు చూసుకొండి డబ్బులు వచ్చాయా.. చూసుకున్నారా.. కన్పర్మేషన్ మెసేజేలు అందుకున్నారా.. అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్‌లని అడిగారు. అవును రూ.15 వేలు వచ్చాయని ఆటోడ్రైవర్‌లు సీఎంకు సమాధానం ఇస్తూ.. వారి ఫోన్లను చూయించారు.

6/7

అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ సేవలో’ పథకంలో భాగంగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు.

7/7

ఈ కార్యక్రమంలో భాగంగా.. షీ ఆటోల మహిళతో సీఎం చంద్రబాబు మట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 05:34 PM