Telugu Badi Nebraska 2025 inauguration: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో తెలుగు బడి ప్రారంభోత్సవం
ABN, Publish Date - Aug 31 , 2025 | 08:47 PM
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు.
ఒమాహా: తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (Telugu Badi Nebraska inauguration) (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు. గత విద్యాసంవత్సరానికి లభించిన విశేష ఆదరణ ఆధారంగా నిర్వాహకులు ఈ సంవత్సరం 30 మంది పిల్లల చేరిక ఉంటుందని భావించినప్పటికీ, 60 మందికి పైగా పిల్లలు చేరడం నెబ్రాస్కా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.
ప్రముఖుల సందేశాలు..
ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు తమ అనుభవాలు, స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించారు.
Dr. ఫణి తేజ్ అడిదమ్ (UNO ప్రొఫెసర్, మాజీ హిందూ దేవాలయ చైర్మన్) – తెలుగు భాష, సంస్కారం, సాంప్రదాయం, భవిష్యత్ జ్ఞానం అని ఒక గొలుసు లాగా అనుసంధానమై ఉంటాయని వివరించారు.
Dr. చంద్రకాంత్ ఆరే (Vice Chair Education, UNMC Dept. of Surgery, CEO – Global Forum of Cancer Surgeons) – బహుభాషలు నేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.
Dr. మురళీధర్ చింతపల్లి (Vice President – Fiserv) – ఒమాహాలో తన తొలి అనుభవాలను పంచుకుంటూ, తెలుగు బడి, TSN కార్యవర్గం సాధించిన పురోగతిని అభినందించారు.
మల్లికా జయంతి (నాట్య గురువు, గురుకులం సెంటర్ ఫర్ ఇండియన్ ఆర్ట్స్ CEO) – భాష, కళలు, సంప్రదాయాలు, సంస్కృతుల అనుబంధాన్ని హృద్యంగా వివరించారు.
రాజా కోమటిరెడ్డి (TSN అధ్యక్షులు) – పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుగు బడి ద్వారా పొందే లాభాలను స్పష్టం చేశారు.
కొల్లి ప్రసాద్(TSN ఉపాధ్యక్షుడు) – TANA పాఠశాలతో భాగస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠ్య ప్రణాళిక ఆవిష్కరణపై వివరిస్తూ, సభలో పాల్గొన్నవారి నుంచి విశేష ఆదరణ పొందారు.
కార్యక్రమంలో భాను TANA పాఠశాల చైర్మన్, తోటకూర ప్రసాద్, సుందర్ చూకర ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఉపాధ్యాయుల పరిచయం
ఈ కార్యక్రమంలో తెలుగు బడి ఉపాధ్యాయులు: వేణు, దివ్య ముఖ్క, పవిత్ర, స్వప్నా, వీణా మాధురి, సుధీర్ లంక అధికారికంగా పరిచయం చేశారు. అనంతరం వారు తల్లిదండ్రులు, పిల్లలకు తమను తాము పరిచయం చేసుకున్నారు.
అలాగే, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, పిల్లలతో ప్రశ్నోత్తర సెషన్ నిర్వహించగా, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా TANA పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠ్య ప్రణాళిక అందుబాటులో ఉండటం వారికి విశేషంగా ఆనందాన్ని ఇచ్చింది.
సభ విజయవంతం
సభ విజయవంతం కావడానికి సహకరించిన TSN కార్యవర్గం, అతిథులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్జే ఝాన్సీ సమన్వయం, ఆకర్షణీయమైన నిర్వాహణతో కార్యక్రమానికి విశేష అందాన్ని చేర్చారు.
కొల్లి ప్రసాద్, TSN కార్యవర్గం తరఫున TANA నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రాజా కసుకర్తి, భాను మగులూరి, TANA అధ్యక్షులు నరేన్ కొడాలికి నెబ్రాస్కా తెలుగు బడి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి ముగింపు వరకు అహర్నిశలూ శ్రమించి విజయవంతం చేయడంలో భాగస్వామ్యం చేసిన తాతారావు, సాంబా, రమేష్, అనిల్, వేణు మురకొండ, వీరు ముప్పారాజు, పవన్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి కృషిని రాజా కోమటిరెడ్డి సభలో ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నడి వీధిలో కత్తితో విన్యాసం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో సిక్కు వ్యక్తి మృతి
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Updated Date - Aug 31 , 2025 | 08:58 PM