ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TANA: బెతూనే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు పంపిణీ

ABN, Publish Date - Sep 13 , 2025 | 08:56 PM

పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దూసుకుపోతోంది. అందులో భాగంగా తానా ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ టీమ్.. మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది.

వాషింగ్టన్, సెప్టెంబర్ 13: పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దూసుకుపోతోంది. తాజాగా తానా ఆధ్వర్యంలో నార్త్ సెంట్రల్ టీమ్.. మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను తానా పంపిణీ చేసింది. దాదాపు 100 మంది విద్యార్థులకు నార్త్ సెంట్రల్ టీమ్ ప్రతినిధులు.. రామ్ వంకిన, ప్రతినిధులు వేదవ్యాస్ అర్వపల్లి, మురళీ కృష్ణతోపాటు శ్రీమాన్ యార్లగడ్డ ఈ బ్యాక్ ప్యాకులు అందజేశారు.

యూఎస్‌లోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలనే ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రామ్ వంకిన స్పాన్సర్ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ సాయి బొల్లినేని, కోశాధికారి రాజా కసుకుర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి తానా నార్త్ సెంట్రల్ వాలంటీర్స్ వెంకట్ జువ్వ, జయరాం నల్లమోతు, సలాది నాయుడు, అజయ్ తాళ్లూరి, రామకృష్ణ అన్నే, సురేష్ బొర్రా, రావు గుత్తా, కోటేశ్వరరావు పాలడుగుతోపాటు రామరాజు కనుమూరి సహాయ సహకారం అందించారు.

మరోవైపు తానా కమ్యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ నిర్వహకులు, టీచర్లు ప్రశంసించారు. బ్యాక్ ప్యాక్ కింద తమ స్కూల్‌‌ను ఎంపిక చేసుకుని చిన్నారి విద్యార్థులకు ఈ విధంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు స్థానిక తానా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నా కన్నా సీనియర్లు లేరు.. నాకు అన్ని అర్హతలు..

మళ్లీ ఉదారత చాటుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

For More NRI News And Telugu News

Updated Date - Sep 13 , 2025 | 08:56 PM