ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivasa Kalyanam In Dublin: డబ్లిన్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం..

ABN, Publish Date - Sep 24 , 2025 | 12:33 PM

యూరోపియన్ దేశాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Srinivasa Kalyanam In Dublin

యూరోపియన్ దేశాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌తోపాటు ఐర్లాండ్‌లోని తెలుగు సమాజం సంయుక్తంగా నిర్వహించిన ఈ కళ్యాణానికి దాదాపు 3, 500 మందికిపైగా భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణాన్ని టీటీడీ ఏఈవో మల్లికార్జున ప్రసాద్ కలపాల పర్యవేక్షణలో ప్రధాన పూజారి రంగనాథ్ నేతృత్వంలోని టీటీడీ అర్చక బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐర్లాండ్ మంత్రి జాక్ చాంబర్స్, ఫింగల్ కౌంటీ కౌన్సిల్ నుంచి కౌన్సిలర్ టామ్ కిట్ తదితర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ శ్రీనివాస కళ్యాణాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఐర్లాండ్ తెలుగు సమాజం సభ్యులు శ్రీధర్ వైకుంఠం, నంద కిషోర్ దొంతినేని, కోటేంద్ర లీల, సప్నా రెడ్డి నల్లూరి, మహేష్ అలిమెల్ల, రామకృష్ణ మదమంచి, వెంకట్ జూలూరి, విష్ణు వర్ధన్ రెడ్డిలతో పాటు ఐర్లాండ్ తెలుగు సంక్షేమ సంఘం సభ్యులు సంతోష్ పల్లి, బాచిరెడ్డి సింగిరెడ్డి, శ్రీనివాస్ కర్పే, శ్రీనివాస్ పుట్ట, అనిల్ రావు దుగ్యాల అంకితభావంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని నిర్వాహకులు వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఊహించిన ఈ చొరవ.. ఆంధ్రప్రదేశ్ గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంలోని తెలుగు ప్రవాసులకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహాకుల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

యూరప్ ప్రధాన ఏపీఏ‌ఎన్‌లీ కో ఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని, సమన్వయకర్త కాట్రగడ్డ కృష్ణప్రసాద్ (నాని), అచ్యుత కిషోర్ కొత్తపల్లి తదితరులు యూరప్ ప్రాంతాలలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవాలను విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో.. ఐర్లాండ్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ కీలకంగా వ్యవహరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఛార్లెట్‌లో ఘనంగా తానా 5కె రన్‌..

లీడ్స్‌ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

For More NRI News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 01:20 PM