ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aashaya Group: జననీ జన్మభూమి గొప్పదిరా.. ప్రవాసీయుల ఆదర్శప్రాయ కృషి

ABN, Publish Date - Aug 18 , 2025 | 09:16 PM

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు.

Aashaya Group

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి (Ravupalli Village) చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు. ఇద్దరు గల్ఫ్ (సౌదీ అరేబియా), ఐరోపా (స్విట్జర్లాండ్)లలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రవాసీయులందరూ కూడా ఏ వైజాగ్ లేదా హైదరాబాద్ కాకుండ తాము పుట్టి పెరిగిన నేలను అభిమానించి అక్కడే ఉండటానికి ఇష్టపడుతూ ‘ఆశయ’ సహాయక బృందం ఒక దానిని నెలకొల్పి గ్రామంలో తమకు వీలైన విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.

గ్రామానికి చెందిన యువకులకు చమురు రంగంలోని సాంకేతిక ఉద్యోగాల్లో నియమితులు కావడానికి అవసరమైన సాంకేతిక శిక్షణ ఇచ్చి వారికి గల్ఫ్ దేశాల్లో ఉపాధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఆయిల్ రంగంలో అత్యధునీక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ మెలకువలు నేర్పించడమే కాదు గ్రామాల్లో అంతరించిపోతున్న కులవృత్తులు చివరకు గంగిరెద్దు సంస్కృతి పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. కు గ్రామంలో పెరిగిన తాము విద్య కారణంగానే ఎదిగామనే విషయాన్ని గుర్తుకు చేయడానికి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ సారి ఆగస్టు 15వ తేదీన విజ్ఞాన వేదిక పేరిట సభా వేదికను నిర్మించి ప్రారంభించామని ఆశయ బృందంలోని కీలక నేత పల్లెం తేజ పేర్కొన్నారు.

సౌదీలోని చమురు రంగంలో ఇంజినీర్‌గా పని చేసే తేజ ఆశయ బృందంలో కీలక నేతగా ఉండటంతో పాటు సౌదీలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన సాటాకు ఈశాన్య ప్రాంత అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. చమురు నేలపై భారతీయ సంస్కృతి, హిందూ పండుగలను సామాన్యులకు చేరువ చేసిన ఖ్యాతి తేజకు దక్కుతుంది. కష్టాల్లో ఉండే తెలుగు ప్రవాసీయులందరికీ కులమతాలకు అతీతంగా సహాయం చేసే స్వభావం ఆయనది. తరుచూగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో దేసూరిగడ్డ వాగు వరద ప్రవహంతో గ్రామంలోని దాదపు 400 ఎకరాల్లోని వరి పంట మునిగిపోయి రైతాంగం నష్టపోతుండటం తమకు బాధ కలిగిస్తోందని పల్లెం తేజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తేజ, ఇతర ప్రవాసీయులు, గ్రామస్థులు మంగళవారం పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి వరద నివారణకు వాగు ఇరువైపులకు ప్రహరీ నిర్మించాలని కోరారు. ఆశయలో తేజతో పాటు దాసరి సూర్య నారాయణ (సౌదీ అరేబియా) గుంట్రేడ్డి రాంబాబు (ఒమాన్) సంబంగి హరి కుమార్ (ఖతర్), స్విట్జర్లాండ్‌లో స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు పొడుగు రామరావులు క్రీయాశీలకంగా ఉండగా వీరికి ఇదే గ్రామానికి చెందిన హైదరాబాద్‌లోని సీనియర్ కార్డియలిజిస్ట్ గుల్ల సూర్యప్రకాశ్ సమన్వయం చేస్తుండగా రాజకీయాలకు అతీతంగా గ్రామ సర్పంచి బొంతాడ మహేశ్ సహాకరిస్తున్నట్లుగా తేజ వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 18 , 2025 | 09:25 PM