USA: తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 07:18 PM
తానా పాఠశాల ఆధ్వర్యంలో అమెరికాలో 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాలు మరువద్దన్న ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్
దేశ, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి పథంలో ఎన్డీయే ప్రభుత్వం దూసుకుపోతోందని వెల్లడి
ఎన్నారై డెస్క్: అమెరికా రాజధాని ప్రాంతంలో తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయపరిచారు. భారతదేశ జాతీయ జెండాను, అమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల పోరాటాలు, త్యాగాలను నిరంతరం గుర్తుచేసుకోవాలన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సామాజిక న్యాయం అనే పునాదులపై మన రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ముందు వరుసలో భారత్, ఆ తర్వాత అమెరికా నిలుస్తోందన్నారు. తెలుగు భాషకు, తెలుగుజాతికి తానా పాఠశాల చేస్తున్న సేవలను కొనియాడారు. భాషే బంధానికి మూలం, సాంస్కృతిక వారసత్వ సంపదని అన్నారు. మాతృభాషను మరిచిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. అనంతరం కూన రవికుమార్‌ను ఘనంగా సత్కరించారు. స్వీట్లు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో యాష్ బొద్దులూరి, రామ్ చౌదరి ఉప్పుటూరి, శ్రావ్య చామంతి, బోనాల రామకృష్ణ, రమేష్ అవిరినేని, గోన మోహనరావు, మేకల సంతోష్ రెడ్డి, బండి సత్యబాబు, నంబూరి చంద్రనాథ్, వనమా లక్ష్మీనారాయణ, చల్లా సుబ్బారావు, వనమా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.




ఈ వార్తలు కూడా చదవండి:
కాలిఫోర్నియాలో వైభవంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీ ప్రముఖులు