Operation Sindoor: ఐదుగురు భారతీయ సైనికులు మృతి
ABN, Publish Date - May 11 , 2025 | 09:16 PM
Operation Sindoor: భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి వేళ భారత్ ఆపరేషన్ సిందూర్‌ను పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులపై ప్రయోగించింది. దీనిలో 100 మంది ఉగ్రవాదులు మరణించారు.
న్యూఢిల్లీ, మే 11: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో ఐదుగురు సైనికులు మరణించారని భారత సైన్యం వెల్లడించింది. సాయుధ దళాలకు చెందిన ఈ ఐదుగురు సైనికుల సేవలను దేశం గుర్తించుకుంటుందని తెలిపింది. ఇక మే 7 నుంచి 10వ తేదీ మధ్య నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం సుమారు 35 నుంచి 40 మంది సిబ్బందిని కోల్పోయిందని వెల్లడించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదులకు చెందిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని వివరించింది. ఇక భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటలకే పాకిస్థాన్ మళ్లీ ఆ ఒప్పందానికి తూట్లు పొడిచిందని తెలిపింది. మళ్లీ భారత్ భూభాగంపైకి పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపితే.. అందుకు ప్రతిగా తీవ్రంగా సమాధానమిస్తామని భారత సైన్యం ప్రకటించింది.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇరవై ఆరు మంది మరణించారు. మృతుల్లో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ దాడికి పాకిస్తాన్ కారణమని భారత్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఈ దాడి జరిగిన దాదాపు రెండు వారాల అనంతరం భారతదేశం 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టింది. ఇది పాకిస్థాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు భారత సైన్యం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Nominated Posts: మళ్లీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
For National News And Telugu News
Updated Date - May 11 , 2025 | 09:17 PM