Padmanabhaswamy Temple: పద్మనాభ స్వామి ఆలయంలో వింత చోరీ.. స్టోర్ కీపర్ చేసిన నిర్వాకంతో..
ABN, Publish Date - Jun 22 , 2025 | 06:19 PM
ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం..
తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో వింత చోరీ జరిగింది. ఆలయంలో అసిస్టెంట్ స్టోర్ కీపర్‌గా పని చేస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి.. 25 లీటర్ల పాలను ఎత్తుకెళ్లాడు. తరచూ ఆలయంలో పాలు తక్కువ అవుతున్నాయనే ఆరోపణలు వస్తుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సంబంధిత ప్రదేశంలో నిఘాను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ స్టోర్ కీపర్‌గా పని చేస్తున్న సునీల్ కుమార్.. రోజూ పాలను చోరీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పద్మనాభ స్వామి ఆలయంలో (Padmanabhaswamy Temple) గతంలో బంగారం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఆలయంలోని 13 పౌండ్ల బంగారు కడ్డీ గత నెలలో మాయమైంది. అయితే రెండు రోజుల తర్వాత ఆ కడ్డీని ఇసుకలో పూడ్చిపెట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, దీని వెనుక ఆలయ సిబ్బంది హస్తం ఉండొచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా, పాల దొంగతనం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం ఆభరణాలను బయటికి తీసిన క్రమంలో మాయమైనట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై అప్పట్లో ఎవరినీ బాధ్యులుగా తేల్చలేదు. అలాగే 2017లో ఆలయంలో రూ.189 కోట్ల విలువైన బంగారం, ఎనిమిది వజ్రాలు మాయమైనట్లు సుప్రీం కోర్టుకు తెలియజేశారు. దీనిపై అప్పట్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్.. తక్షణ శాంతికి పిలుపు
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
For National News And Telugu News
Updated Date - Jun 22 , 2025 | 07:18 PM