Rahul Gandhi US Tour: 21, 22వ తేదీల్లో అమెరికాలో రాహుల్ పర్యటన
ABN, Publish Date - Apr 18 , 2025 | 02:56 AM
రాహుల్ గాంధీ ఈ నెల 21 22 తేదీలలో అమెరికా పర్యటనలో భాగంగా బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు అధ్యాపకులతో ముఖాముఖి చర్చలు జరుపనున్నారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 21, 22 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని ఆ పార్టీ నేత పవన్ ఖేరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బ్రౌన్ యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. అంతకుముందు ప్రవాస భారతీయులు, ప్రవాస భారత కాంగ్రెస్ సభ్యులతో సమావేశమవుతారన్నారు. 2024లోనూ రాహుల్ తన అమెరికా పర్యటనలో టెక్సాస్ యూనివర్సిటీ, జార్జిటౌన్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News
Updated Date - Apr 18 , 2025 | 02:57 AM