Telangana police: తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:04 AM
ఇండియా జస్టిస్ నివేదిక-2025లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
ఇండియా జస్టిస్ నివేదికపై హర్షం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇండియా జస్టిస్ నివేదిక-2025 ప్రకారం కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్ధానంలో నిలిచిందని, టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్‌కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజాపాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి...