ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: ఇది రోడ్డా.. సముద్రమా.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:39 AM

భారీ వర్షాలకు రోడ్లు జలమయమవడం సర్వసాధారణమే. కానీ ఓ చోట వానలతో రోడ్డు ఏకంగా సముద్రాన్ని తలపించింది. ఆ ప్రవాహంలో భారీ వాహనాలే వెళ్లలేక ఇబ్బందులు పడ్డాయి. ఇక, చిన్న వాహనాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Heavy Rains

మన దేశంలోని చాలా వరకు నగరాల్లో మామూలు వర్షానికే రోడ్లు జలమయం అవుతుంటాయి. భారీ వానలు పడితే అవి చెరువుల్ని తలపిస్తుంటాయి. అలాంటిది గంటల కొద్దీ అతిభారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మహారాష్ట్రలోని పూణెలో అదే జరిగింది. గంటల తరబడి కురిసిన భారీ వానలకు అక్కడి రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. రహదారుల నిండా భారీగా వరద నీరు పేరుకుపోయింది. ఆ నీరు చాలా ఎత్తులో ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరద నీటిలో బస్సులు సగం మునిగిపోవడం గమనార్హం. పూణెలో ముఖ్యంగా హింజెవాడీ ఐటీ పార్క్ ఏరియాలో భారీగా వర్షం పడింది.


వీడియోలు వైరల్..

హింజెవాడీలో రోడ్లపై భారీగా వరద నీరు చేరడం, ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, నీళ్లలో వాహనాలు చిక్కుకుపోవడం తదితర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె కూడా దీనికి సంబంధించిన ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. రోడ్లపై భారీగా నీరు చేరిందని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) అధికారులను ఆమె కోరారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ పనిచేస్తోందా లేదా.. అనేది అనుమానంగా ఉందని ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌లో సుప్రియా సూలె రాసుకొచ్చారు. సంబంధిత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇక్కడి కాలువల్ని శుభ్రం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భవిష్యతులో ఇలాంటి సమస్యలు రాకుండా, రోడ్లపై వరద నీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంఐడీసీని ఆమె కోరారు. కాగా, పూణెలో వానలు ఎంతకీ తగ్గకపోవడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.


ఇవీ చదవండి:

55 ఏళ్ల మహిళతో ఎఫైర్..60 ఏళ్ల ఆమె భర్తను..

స్బీర్‌ ఫోన్‌లో 150 పాకిస్థాన్‌ కాంటాక్టులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 11:39 AM