Share News

Young Man: 55 ఏళ్ల మహిళతో ఎఫైర్..60 ఏళ్ల ఆమె భర్తను..

ABN , Publish Date - Jun 08 , 2025 | 09:17 AM

Young Man: ప్రదీప్‌కు, సుబ్రమణ్య భార్యకు సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ప్రియురాలి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రదీప్ భావించాడు. సుబ్రమణ్య అడ్డు తొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాడు. సుబ్రమణ్యాన్ని చంపడానికి ప్రదీప్ ప్లాన్ చేశాడు.

Young Man: 55 ఏళ్ల మహిళతో ఎఫైర్..60 ఏళ్ల ఆమె భర్తను..
Young Man

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కోసం జీవిత భాగస్వాములను చంపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని నెలల క్రితం మీరట్‌కు చెందిన ముస్కాన్ అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. శవాన్ని ముక్కలు చేసి, డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసింది. ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తప్పులు చేసిన వాళ్లు జైలు పాలు సైతం అయ్యారు. అయితే, శిక్షలు పడతాయని తెలిసినా జనాల్లో మార్పు రావటం లేదు. ఎఫైర్ల కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, ఓ 33 ఏళ్ల యువకుడు 55 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.


ఆమెతో సంబంధం కోసం ఆమె భర్తను చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిక్‌మంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం, కోటె ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సుబ్రమణ్య, 55 ఏళ్ల తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతడు కొత్తగా ఓ ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటి నిర్మాణ పనుల్ని 33 ఏళ్ల ప్రదీప్ అనే వ్యక్తికి అప్పగించాడు. ఇంటి పనుల మీద ప్రదీప్ తరచుగా సుబ్రమణ్యం ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు.


ఈ నేపథ్యంలోనే ప్రదీప్‌కు, సుబ్రమణ్య భార్యకు సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ప్రియురాలి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రదీప్ భావించాడు. సుబ్రమణ్య అడ్డు తొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాడు. సుబ్రమణ్యాన్ని చంపడానికి ప్రదీప్ ప్లాన్ చేశాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించి డాక్యుమెంట్లు ఇస్తానని చెప్పి.. సుబ్రమణ్యాన్ని ఓ చోటుకు రప్పించాడు. అక్కడ తన స్నేహితులు సిద్దేశ్,విశ్వాస్‌లతో కలిసి అతడ్ని చంపేశాడు. తర్వాత శవాన్ని కంసగర్ గేటు దగ్గరకు తీసుకెళ్లి కాల్చేశాడు.


సుబ్రమణ్య 2వ తేదీన ఇంటినుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు మరుసటి రోజు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ప్రదీప్ చేసిన దారుణం బయటపడింది. పోలీసులు ప్రదీప్‌తో పాటు అతడికి సహకరించిన సిద్దేశ్, విశ్వాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రభాస్ సినిమా కోసం నటుడి కష్టాలు

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

Updated Date - Jun 08 , 2025 | 09:17 AM