Share News

Punjab YouTuber: జస్బీర్‌ ఫోన్‌లో 150 పాకిస్థాన్‌ కాంటాక్టులు

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:31 AM

ఆయన ఆరుసార్లు పాకిస్థాన్‌లో పర్యటించి, నేరుగా పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ గూఢచారులతో భేటీ అయినట్టు తేల్చారు. గూఢచర్యం కేసులో అరెస్టయిన మరో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్‌కు పరిచయం ఉన్నట్టు గుర్తించారు.

Punjab YouTuber: జస్బీర్‌ ఫోన్‌లో 150 పాకిస్థాన్‌ కాంటాక్టులు

ఆయనను ఐఎ్‌సఐకి పరిచయం చేసిన

పాక్‌ మాజీ పోలీసు, యూట్యూబర్‌ నాసిర్‌ థిల్లాన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 7: పాకిస్థాన్‌ కోసం భారత్‌లో గూఢచర్యం చేస్తున్న కేసులో అరెస్టయిన పంజాబ్‌ యూట్యూబర్‌ జస్బీర్‌సింగ్‌ ఫోన్‌లో 150 వరకు పాకిస్థాన్‌ కాంటాక్టులు (ఫోన్‌ నంబర్లు) ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించారు. ఆయన ఆరుసార్లు పాకిస్థాన్‌లో పర్యటించి, నేరుగా పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ గూఢచారులతో భేటీ అయినట్టు తేల్చారు. గూఢచర్యం కేసులో అరెస్టయిన మరో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్‌కు పరిచయం ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు.. పాక్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి, ప్రస్తుతం యూట్యూబర్‌గా ఉన్న నాసిర్‌ థిల్లాన్‌ లాహోర్‌లో తనను ఐఎ్‌సఐ గూఢచారి, ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన డానిష్‌ అలియస్‌ ఎహ్సాన్‌ ఉర్‌ రెహ్మాన్‌కు పరిచయం చేసినట్టుగా జస్బీర్‌సింగ్‌ వెల్లడించినట్టు తెలిసింది. డానిష్‌ తన నుంచి కొన్ని సిమ్‌కార్డులు తీసుకున్నాడని.. పాక్‌ నిఘా అధికారి ఒకరికి తన ల్యాప్‌టా్‌పను గంటపాటు అప్పజెప్పానని వివరించినట్టు సమాచారం. జస్బీర్‌ ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఫోరెన్సిక్‌ నిపుణులతో పరిశీలన జరుపుతున్నారు. పాక్‌ మాజీ పోలీసు అధికారి నాసిర్‌ థిల్లాన్‌ యూట్యూబర్‌ ముసుగులో భారత యూట్యూబర్లతో పరిచయం పెంచుకుని, ఐఎ్‌సఐ గూఢచారి డానిష్‌ వద్దకు తీసుకెళ్లి.. వారిని ప్రలోభాలతో గూఢచర్యంలోకి దింపినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. డానిష్‌ ఏవేవో కార్యక్రమాలకు ఆహ్వానం పేరిట ఈ యూట్యూబర్లను పాక్‌ హైకమిషన్‌కు రప్పించుకుని, వారికి టాస్క్‌లు అప్పగించినట్టు గుర్తించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:31 AM