ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్..విజయ యాత్ర ఫస్ట్ వీడియోలు చుశారా..

ABN, Publish Date - May 07 , 2025 | 06:54 PM

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేసిన దాడిపై భారత్ సహా అనేక దేశాల్లో ప్రజలు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు చేసే చర్యలను ఏ దేశం కూడా సపోర్ట్ చేయడం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం పెంచి పోషిస్తుంది.

Operation Sindoor

పాకిస్తాన్, పీఓకే ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేసిన దాడులు ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారాయి. బుధవారం తెల్లవారుజామున ఈ దాడులు జరుగగా, అందుకు సంబంధించిన మొదటి వీడియోలు ఇండియన్ ఆర్మీ నుంచి వెలుగులోకి వచ్చాయి. వీడియోలలో టార్గెట్ మిసైల్ స్ట్రైక్స్‌ను చూపిస్తున్నాయి. ఈ దాడి పాకిస్తాన్, PoKలోని ఉగ్రవాద శిబిరాలపై జరిగాయి. వీటిలో స్వాయి నల్లా, సర్జల్, మురిడ్కే, కోట్లీ, కోట్లీ గుల్పూర్, మిహ్మూనా జోయా, భిమ్బర్, బహావల్పూర్ వంటి చోట్ల ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. వీడియోలను చూస్తుంటే పక్కా టార్గెట్ చూసుకుని దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల ద్వారా 70 మంది మరణించగా, 60 మందికిపైగా గాయపడినట్లు సమాచారం.


ప్రస్తుత పరిణామాలు

భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ కేవలం ప్రతిస్పందన మాత్రమే కాదు. భారతీయ సైన్యం ఈ దాడులను సూక్ష్మంగా, సంసిద్ధతతో, బాధ్యతాయుతంగా చేపట్టింది. ముఖ్యంగా భారతదేశంలో పాకిస్తాన్ చేస్తున్న దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. అంతేకాదు తర్వాత కూడా పాకిస్తాన్ తీరు మారకపోతే ఇదే దాడులు కొనసాగుతాయని భారత్ చెప్పకనే చెప్పింది. ఇంకా ఉగ్రవాదులను పెంచిపోషిస్తే ఇలాంటి దాడులు తప్పవని హెచ్చరించింది.


భవిష్యత్తులో మరింత చర్యలు

భారత్‌కి ఈ తరహా దాడులకు ప్రతిస్పందన ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇదే సమయంలో ఈ దాడులకు పాకిస్తాన్‌ కూడా రివేంజ్ తీర్చుకునే ఛాన్సుంది. కాబట్టి భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ దొంగ చాటుగా ఎటాక్ చేస్తుందని అంటున్నారు. ఇటీవల కశ్మీర్‎లో కూడా టూరిస్టులపై ఎటాక్ చేసిన క్రమంలో సైనికుల వేశాల్లో వచ్చి పాక్ దుండగులు దాడులు చేశారు.

భారత ప్రజల స్పందన

భారత ప్రజలు ఈ దాడిని స్వాగతిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠమని చెబుతున్నారు. దీంతోపాటు అనేక మంది కూడా ఈ దాడి పట్ల పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 08:15 PM