ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

ABN, Publish Date - Jun 04 , 2025 | 11:51 AM

రాష్ట్రంలో.. నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుండి వచ్చే ఆదివారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆ శాఖ హెచ్చరించింది.

- రాష్ట్రానికి వర్ష సూచన

చెన్నై: బంగాళాఖాతంలో పశ్చిమ దిశ గాలుల్లో వేగం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం నుండి ఈ నెల 8వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొన్న కారణంగా కనిష్ఠంగా 90 డిగ్రీల నుండి గరిష్ఠంగా 102 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


గరిష్ఠంగా వేలూరు, తూత్తుకుడి, తిరుచ్చి, మదురై, కరూర్‌ జిల్లాల్లో 102 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఆ జిల్లాల ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లిపోయారు. అదేవిధంగా చెన్నై, ఈరోడ్‌, పాళయంకోట్ట, తంజావూరులో 10 డిగ్రీలు, నాగపట్నం, తిరుపత్తూరు, తిరుత్తణిలో 90 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఇక వేలూరు, కరూర్‌(Veluru, Karoor), దిండుగల్‌, చెన్నై ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు మంగళవారం వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలులు వేగం పుంజుకున్న కారణంగా బుధవారం నుండి వచ్చే ఆదివారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆ శాఖ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 11:51 AM