Share News

Adi Srinivas: బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:33 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆది శ్రీనివాస్‌ కవితా పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని, కేసీఆర్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.

Adi Srinivas: బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘ఏ పార్టీతోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ పొత్తు పెట్టుకోదంటూ హరీఽశ్‌రావు అమాయకంగా చెబుతున్నారు. అసలు ఆ పార్టీ అంటూ ఉంటే కదా.. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేది! బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం ఖాయం. ఈటల రాజేందర్‌ మధ్యవర్తిగా ఈ వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది’’ అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. బీజేపీలో విలీన ప్రయత్నాలను కేసీఆర్‌ కూతురు కవితే స్వయంగా బయటపెట్టారని పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను మభ్యపెట్టేందుకే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమంటూ హరీశ్‌రావు మాట్లాడుతున్నారన్నారు. కవిత ప్రశ్నలపై ఇప్పటి వరకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు ఎందుకు స్పందించలేదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:33 AM