AP Govt: ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Jun 03 , 2025 | 08:08 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్‌లో పలు కీలక అంశాలు చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
అమరావతి, జూన్ 03: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. బుధవారం ఉదయం 11. 00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అలాగే అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ అమోదం తెలపనుంది. ఇక హెచ్‌వోడీ నాలుగు టవర్ల టెండర్లకు సైతం కేబినెట్ అమోదించనుందని తెలుస్తుంది.
మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో దశలో 44 వేల ఎకరాల భూమి సేకరించే అంశాన్ని సైతం ఈ సమావేశంలో చర్చించి.. ఆమోదించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే అమరావతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేబినెట్ అమోదం తెలపనుంది.
2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంపెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి అమోదం తెలపనుంది. ఇక తల్లికి వందనంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరగనుంది. జూన్ 21వ తేదీన వైజాగ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా డేపై చర్చించనున్నారు.
జూన్ 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించనున్నారు. ఇంకోవైపు 48వ సీఆర్డీఏ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అదీకాక రాజధాని అమరావతికి మరికొన్ని వేల ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలో ఆ సేకరణకు సంబంధించిన అంశాలు ఈ కేబినెట్ భేటీలో ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్రాడ్‌పై నివేదిక కోరిన కాగ్
ఈ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..?
For Andhrapradesh News And Telugu news