Opertaion Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన
ABN, Publish Date - May 13 , 2025 | 06:03 PM
Opertaion Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై భారత విదేశాంగ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, మే 13: ఆపరేషన్ సింధూర్‌పై భారత విదేశాంగ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణపై డీజీఎంవోల సమావేశంలో చర్చించామని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ క్రమంలో ఈ భేటీలో కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాల్పుల విరమణ ప్రతిపాదత పాకిస్థాన్ నుంచే వచ్చిందన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీ చేయించాలన్నదే భారత్ విధానమని రణ్‌ధీర్ జైస్వాల్ కుండుబద్దలు కొట్టారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక విధానంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోందని రణ్‌ధీర్ జైస్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్ జరుగుతోన్న సమయంలో భారత్, అమెరికా నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదని చెప్పారు. ఇక సింధూ నది జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. కాశ్మీర్‌పై తమ విధానం మారలేదని తెలిపారు. కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తామని పేర్కొన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే చర్చలు ఉంటాయని ఆయన వివరించారు. టిఆర్ఎఫ్ లష్కరితోయోబా అనుబంధ సంస్థ అని తెలిపారు. దీనిపై అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలివేయడం అనేది మిగిలి ఉన్న విషయమని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. మృతుల్లో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబా సంస్థకు చెందిన ది రిసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఇక లష్కరే తోయిబా సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ పహల్గాం దాడి.. వెనుక పాక్ హస్తం ఉందని భారత్ స్పష్టమైన సాక్ష్యాలను సంపాదించి.. ప్రపంచం ముందు ఉంచింది. అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో ఇరుదేశాలు.. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు జరిపింది.
అందుకు ప్రతిగా పాకిస్థాన్ సైతం భారత్ సరిహద్దుల్లోని పలు రాష్ట్రాలకు చెందని జిల్లాలపైకి క్షిపణులు, డ్రోనులతో దాడి చేసింది. ఈ దాడిని భారత్ తిప్పికొట్టింది. ఇక పాకిస్థాన్ దిగి వచ్చి.. కాల్పుల విరమణ ఒప్పందం చేసుందామంటూ భారత్ ముందు ప్రతిపాదన ఉంచింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
DD Next Level Movie: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న మూవీపై పోలీసులకు ఫిర్యాదు
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో ఓవర్ యాక్షన్
Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్
For National News And Telugu News
Updated Date - May 13 , 2025 | 06:18 PM