Shubhanshu Shukla: చరిత్ర సృష్టించడానికి ముందు.. భార్యకు కెప్టెన్ శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం..
ABN, Publish Date - Jun 25 , 2025 | 01:42 PM
Kamna Subha Mishra: భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందుగా ఆయన తన భార్య కామ్నా కోసం ఒక భావోద్వేగపూరిత లేఖ రాశాడు. ప్రస్తుతం అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Shubhanshu Shukla Heartfelt note to wife: ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది! ISSకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla) రికార్డు సృష్టించారు. అనేక అవాంతరాల అనంతరం జూన్ 25, 2025న యాక్సియం మిషన్-4 (Ax-4)లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, అతని ముగ్గురు సహచరులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS ) కి విజయవంతంగా చేరుకున్నారు. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. అయితే,చరిత్ర సృష్టించే ముందు కెప్టెన్ శుభాన్షు శుక్లా తన భార్య కామ్నా కోసం ఒక భావోద్వేగపూరిత లేఖ రాశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి యాక్సియంమిషన్-4 (Ax-4) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS ) కి బయలుదేరింది కెప్టెన్ శుభాంశు శుక్లా బృందం. అంతకుముందే, కెప్టెన శుభాంశు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో ఇలా రాశారు. 'మేము జూన్ 25 తెల్లవారుజామున భూమి నుండి బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. విజయవంతంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ మాపై ప్రేమ చూపుతున్న అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
భార్యను ఉద్దేశిస్తూ 'అద్భుతమైన భాగస్వామిగా ఉన్నందుకు కామ్నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు లేకుండా ఇవేవీ సాధ్యం కాలేదు. కానీ ముఖ్యంగా ఇవేవీ పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు కావు' అని అంటూ వీడ్కోలు పలుకుతున్న చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.
అదే సమయంలో, శుభాన్షు తల్లి ఆశా శుక్లా, యాక్సియం మిషన్-4కు ముందు తన కుమారుడికి కోడలు అందించిన మద్దతును ప్రశంసించారు. 'ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశంలోని త్రివేణి నగర్‌కు చెందిన ఒక అబ్బాయి ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. మా కోడలు లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ విజయంలో తను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది' అని ఆమె అన్నారు.
ఇవీ చదవండి:
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 25 , 2025 | 02:21 PM