ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్‌లోని 15 నగరాలు టార్గెట్ చేసిన పాక్..

ABN, Publish Date - May 08 , 2025 | 05:12 PM

India Pakistan Tensions 2025: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత దాయాది దేశం మరింత రగిలిపోతుంది. ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి యదేచ్ఛగా పౌరులపై దాడి చేస్తున్న పాక్ సైన్యం.. తాజాగా భారతదేశంలోని ఈ 15 నగరాలను టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పూర్తి జాబితా కోసం..

Pakistan Attacks Indian Cities

Pakistan Attacks Indian Cities: పహల్గాంలో ఉగ్రవాదులు అమానుష దాడులకు తెగబడిన నాటి నుంచి పాకిస్థాన్ ఇంకా రెచ్చిపోతోంది. ఒక పక్క దాయాది దేశ నేతలు మాటల తూటాలు పేలుస్తుంటే.. మరోపక్క పాక్ ఆర్మీ సరిహద్దుల్లో ఎడతెగకుండా కాల్పులు జరుపుతూనే ఉంది. మే 7న భారత త్రివిధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. న్యూఢిల్లీకి ఎలాగైనా బదులివ్వాలని ఆరాటపడుతోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం భారతదేశంలోని ఈ కింది ప్రధాన నగరాలను శత్రు దేశం టార్గెట్ చేసింది.


పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులే మా లక్ష్యం. పౌరులు, సైనిక స్థావరాల కాదని భారత్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. దాయాది దేశం కోపం కట్టలు తెంచుకుంటోంది. మే 7-8 రాత్రి, పాకిస్థాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌ సహా అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. భారత సాయుధ దళాలూ ఈ దాడులకు దీటుగా స్పందించాయి. పాక్ దాడులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలు (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) సమర్థంగా అడ్డుకున్నాయి.


ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను భారతసేనలు విజయవంతంగా కూల్చేసాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని సైనిక లక్ష్యాలపై దాడికి తగిన ప్రతిస్పందన ఉంటుందని కూడా హెచ్చరించింది. నివేదికల ప్రకారం, భారత భద్రతా బలగాలు S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా శత్రుదేశ డ్రోన్లు, క్షిపణులను కుప్పకూల్చాయి. పాక్ దాడులు చేసిందనేందుకు రుజువుగా ఆయా ప్రాంతాల్లో శకలాలు సేకరిస్తున్నాయి.


ఇస్లామాబాద్ లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల జాబితా:

  1. అవంతిపుర

  2. శ్రీనగర్

  3. జమ్మూ

  4. పఠాన్‌కోట్

  5. అమృత్‌సర్

  6. కపుర్తల

  7. జలంధర్

  8. లూథియానా

  9. ఆదంపూర్

  10. భటిండా

  11. చండీగఢ్

  12. నల్

  13. ఫలోడి

  14. ఉత్తర్లై

  15. భుజ్


మరోవైపు, నియంత్రణ రేఖ వద్ధ పాకిస్థాన్ మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగులను ప్రయోగిస్తూ కాల్పుల తీవ్రతను పెంచింది. ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఇదెలా ఉంటే, ఇప్పటివరకూ పాక్ సైన్యం కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నపిల్లలు సహా 16 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఘటన నాటి నుంచి మొత్తంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు.


Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకం

China's Role in Ind Pak Conflict: భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్

India Drone Attacks : ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్

Updated Date - May 08 , 2025 | 05:37 PM