Assembly elections: అధికారంలోకి వచ్చాక.. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్
ABN, Publish Date - Aug 05 , 2025 | 11:14 AM
రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తిరునల్వేలి సభలో మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి.
- తిరునల్వేలి సభలో ఈపీఎస్ హామీ
చెన్నై: రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తిరునల్వేలి సభలో మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి. అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలుపరిచిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ఎడప్పాడి పళనిస్వామి కోవై జిల్లా మేట్టుపాళయంలో గత నెల 7వ తేదీ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ పేరిట తొలివిడత ప్రచారం ప్రారంభించారు.
అక్కడినుంచి డెల్టా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జూలై 7వ తేదీ వరకు పర్యటించి తన తొలివిడత ప్రచారయాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత 24 నుంచి ప్రారంభించిన రెండో విడత ప్రచారయాత్రను శివగంగ జిల్లాలో పూర్తిచేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP State President Nayanar Nagendran) ఆహ్వానం మేరకు విందులో పాల్గొన్న ఈపీఎస్ సోమవారం ఉదయం 10 గంటలకు తన పర్యటన ప్రారంభించారు.
తిరునల్వేలి జంక్షన్‌లో ఉన్న ఓ హోటల్‌లో రైతులు, వ్యాపారులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, కుల వృత్తుల సంఘాల ప్రతినిధులతో ఈపీఎస్, నయనార్ నాగేంద్రన్ సమావేశమయ్యారు. ఈ సభలో ఈపీఎస్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే విజ్ఞప్తి చేయడంవల్లే ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకుల్లో రైతులు రుణాలు పొందేందుకు సిబిల్ స్కోర్ విధానాన్ని రద్దుచేశారని, రైతుల సంక్షేమం కోసమే అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా, లేకున్నా.. పనిచేస్తుందన్నారు.
తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక సాగు పనులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు తాళయూత్తు మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో అన్నాడీఎంకే ఐటీ వింగ్‌తో సమావేశమైన ఈపీఎస్ పార్టీ తరుఫున ఓటర్లకు పంపించాల్సిన అంశాలు, ప్రచారం తదితర అంశాలపై సూచనలిచ్చారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరునల్వేలి టౌన్ వాగైఅడి గ్రౌండులో, 6 గంటలకు పాళయంకోట మార్కెట్ జంక్షన్‌లో రోడ్‌షోలో పాల్గొన్నారు.
రాత్రి 8 గంటలకు మాంగనేరి నియోజకవర్గం కళ్లకాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాత్రి తెన్‌కాశి జిల్లా కుట్రాలంలో బస చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కుట్రాలం నుంచి బయలుదేరనున్న ఈపీఎస్ 5 గంటలకు తెన్‌కాశిలో, సాయంత్రం 6.30 గంటలకు అంబాసముద్రం ఫ్లవర్‌బజార్‌లో, రాత్రి 8 గంటలకు ఆలంగర్‌లోని కామరాజర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ఈపీఎస్ మాట్లాడనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 05 , 2025 | 11:14 AM