Delhi Men's Satyagraha : భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా.. దయచేసి మగాళ్లకూ రక్షణ కల్పించండి..
ABN, Publish Date - Apr 19 , 2025 | 01:53 PM
Delhi Men's Satyagraha: ఆడవాళ్లకు ఎలాగైతే వేధింపుల నుంచి కాపాడేందుకు షీ టీమ్ ఏర్పాటు చేశారో.. మగాళ్లకూ అలాగే హీ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వేలాది పురుషులు ఏకమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేశారు.
Save Indian Family Foundation Mens Protest: చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని భర్తలపై దొంగ కేసులు బనాయించే భార్యల సంఖ్య ఈ మధ్య పెరుగుతోందని.. సమాజంలో ఈ పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమవుతున్న మగాళ్లకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహం చేపట్టారు పురుషులు. మగవారి హక్కుల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో "సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్‌మెంట్" పేరుతో నిర్వహించిన ధర్నాలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 2000 పురుషులు పాల్గొనగా.. ఈ నిరసనలో మహిళలూ వీరికి అండగా నిలబడటం విశేషం.
ఆ చట్టం వెంటనే రద్దు చేయాలి..
భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనని.. స్వార్థం కోసం భర్తపై వరకట్నం, వేధింపుల పేరుతో కేసులు వేస్తున్న భార్యల నుంచి భర్తలను కాపాడాలని భార్యా బాధితుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. వరకట్నం కేసులు అన్నింటిలో భర్తను, వారి కుటుంబ సభ్యులనే దోషులుగా పరిగణించడం సరికాదని.. పురుషుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిందేనని కోరారు. 498A చట్టం వెంటనే రద్దు చేయాలని.. మొదట విచారణ జరిపాకే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయాలని.. నిజానిజాలు తెలుసుకోకుండా కేసులు నమోదు చేయకూడదని డిమాండ్ చేశారు.
మాకూ హీ టీం కావాలి..
ఆడవాళ్లకు భర్తల వేధింపుల నుంచి కాపాడేందుకు ప్రత్యేక జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే.. అక్రమ కేసులు, గృహహింసకు గురవుతున్న భర్తల కోసం కూడా ప్రత్యేక జాతీయ కమిషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని.. మగాళ్ల కోసం ప్రత్యేక చట్టాలు, హీ టీంలు తీసుకురావాలని ధర్నాలో పాల్గొన్న భార్యాబాధితులు డిమాండ్ చేశారు.
Read Also: Project Cheetah: జురాసిక్ పార్క్ తరహాలో.. అంతరించిన చీతాలకు పునర్జన్మ.. ఎలా అంటే..
India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..
Maharashtra: అప్పుడు అందరికీ బట్టతల వైరస్.. ఇప్పుడు ఇంకోటి.. వరస మిస్టరీ వైరస్‌లకు కారణమేంటి..
Updated Date - Apr 19 , 2025 | 09:21 PM