Viral Fevers: సీజన్ కాకున్నా.. వ్యాపిస్తున్న వైరల్ జ్వరాలు
ABN, Publish Date - May 13 , 2025 | 12:17 PM
మహానగరం చెన్నై జ్వరాల బారిన పడింది. జ్వరాలకు ఇప్పుడె సీజన్ కాకున్నప్పటికీ పలువురు జ్వరాలబారిన పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం ఏదైనప్పటికీ నగరంలో పలువురు జ్వరాల బారిన పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
చెన్నై: నగరంలో వారం రోజులుగా కొత్తగా వైరల్ జ్వరాలతో(Viral Fevers) బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు వస్తాయి. అవి సులువుగా అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తాయి. ప్రస్తుతం అగ్నినక్షత్రంలో ఈ జ్వరాలను సీజన్ జ్వరాలు అని చెప్పలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయినా జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వరాలతో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: ఊటీలో సీఎం స్టాలిన్.. నాలుగు రోజులు అక్కడే మకాం
కొత్తగా వైరల్ జ్వరాలు కావొచ్చని చెబుతున్నారు. ఈ విషయమై వైరాలజీ నిపుణులు మాట్లాడుతూ... ఇది సాధారణమైన ‘ఫ్లూ’ జ్వరాలేనని, తెలిపారు. వీటిలో ఇన్‌ఫ్లూయెంజా బి.వైరస్ కాస్త వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. జ్వరం తగ్గినప్పటికి రెండు వారాల పాటు గొంతు నొప్పిగా ఉంటుందన్నారు. ఈ గొంతునొప్పి వల్ల మాటలు సరిగా రావని,
దీని కారణంగానే నగరవాసులు ఈ రకం జ్వరాలంటే భయపడుతున్నారని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రస్తుతం నగరమంతా జ్వరాలు వ్యాప్తి చెందుతుండటాన్ని రాష్ట్ర రోగనిరోధక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని, ఎలాంటి వైర్‌స లేదని నిర్ధారణ అవుతోందని తెలిపారు. అయినప్పటికీ రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News
Updated Date - May 13 , 2025 | 12:17 PM