ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: సీఎంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ విమర్శలు.. ఓటమి భయంతోనే కొత్త పథకాలు

ABN, Publish Date - Aug 13 , 2025 | 12:56 PM

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ధ్వజమెత్తారు.

- సీఎంస్టాలిన్‌పై నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(Nayanar Nagendran) ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం టి.నగర్‌ థామ్‌సరోడ్డులో ‘సేవావారం’ అనే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన నిరుపేదలకు విసనకర్రలు, చేటలు, తాటాకుల చాపలను అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్‌ పి.సెల్వం, జిల్లా శాఖ అధ్యక్షుడు గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేంద్రన్‌ మాట్లాడుతూ ఈ యేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఇంటింటా జరుపమంటూ బీజేపీ జాతీయ కమిటీ ఆదేశించిందని, ,ఆ మేరకు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలోనూ జెండా పండుగను ఘనంగా నిర్వహించనున్నామన్నారు.

సెప్టెంబర్‌ 2 వరకు ఈ వేడుకలను కొనసాగించాలని కూడా పార్టీ అధిష్టానవర్గం సూచించిందని చెప్పారు. దేశంలో చేతివృత్తి కళాకారులు తయారు చేసే వస్తువులను ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాము సేవావారం కార్యక్రమంలో విసనకర్రలు, తాతాకుల చాపలను పేదలకు ఉచితంగా అందిస్తున్న తెలిపారు. కాగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని నాగేంద్రన్‌ విమర్శించారు. రాష్ట్రమంతటా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సింగపూరు నుండి తరలించిన రూ.7 కోట్ల గంజాయిని విమానాశ్రయంలో పట్టుకున్నారని తెలిపారు.

డీఎంకే ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రకటించిన పథకాలన్నీ నాలుగేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అమలు చేయాల్సినవని, ఎన్నికల భయంతోనే స్టాలిన్‌ ఈ పథకాలను హడావుడిగా ప్రారంభిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ కూటమిలోకి మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను చేర్చుకునే విషయంపై సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని విలేఖరులడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్‌ కోబ్రా

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2025 | 12:56 PM