ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: మన మిస్సైల్స్‌తో కాంగ్రెస్‌ వారికే అధిక బాధలు..

ABN, Publish Date - May 15 , 2025 | 02:00 PM

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మిస్సైల్స్‌తో కాంగ్రెస్‌ వారికే అధిక బాధలున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. అలాగే ఇంకా పలు విషయాలపై మాట్లాడారు.

- పాకిస్థాన్‌ కంటే ఎక్కువ బాధపడుతున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఎద్దేవా

బెంగళూరు: పహల్గాం దాడి ప్రతీకారానికి భారతసైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట ప్రయోగించిన మిస్సైల్స్‌ పాకిస్థాన్‌ వాసులకంటే కాంగ్రెస్‌ నాయకులకే ఎక్కువ బాధ కలిగినట్లు అనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP State President Vijayendra) వ్యంగ్యం చేశారు. గురువారం ఎక్స్‌లో విజయేంద్ర ఘాటుగా స్పందించారు. రెండుమూడు రోజులుగా కొందరు కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలు పరిశీలిస్తే పాకిస్థాన్‌ మిలిటరీ అధికారిక సమాచారాన్ని తలపిస్తున్నాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Dogs: ఆ నగరంలో మొత్తం వీధి కుక్కల సంఖ్య ఎంతో తెలిస్తే..


సీఎం సిద్దరామయ్య ఇండియన్‌ మిలిటరీ చర్యలను వ్యతిరేకించి పాకిస్థాన్‌ ప్రశంసలు పొందారన్నారు. ఓ కాంగ్రెస్‌ నేత పాకిస్థాన్‌ బీజేపీకి వ్యతిరేకమని, తమకు కాదని వ్యతిరేకిస్తారన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఎంతోమంది ఉగ్రవాదులు అంతర్జాతీయస్థాయిలో నేరస్తులుగా ముద్రపడినవారని, ముంబైతోపాటు పలు దాడులకు కారకులన్నారు. కాగా ప్రతిపక్షనేత అశోక్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రి ప్రియాంకఖర్గే నేరుగా ఇందిరాగాంధీకి ఉత్తరాధికారి తరహాలో మాట్లాడుతున్నారన్నారు.


జాతీయకాంగ్రెస్‌ బాధ్యతలను జూనియర్‌ ఖర్గేకు కాంట్రాక్టు ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. ఆయన సొంత జిల్లా కలబురగిలో ఇటీవల ఎస్‌ఎ్‌సఎల్‌సీ ఫలితాలలో అత్యంత తక్కువశాతం ఉత్తీర్ణత సాధించారనేది తెలుసుకుంటే బాగుంటుందన్నారు. మీ జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఎందుకో రాహుల్‌గాంధీని వదిలి ఇందిరాగాంధీని పొడుగుతున్నారన్నారు.


మీ తండ్రి మల్లికార్జున ఖర్గే 50ఏళ్లు కాంగ్రెస్‏లో పనిచేసినా ముఖ్యమంత్రి కాలేదని, కానీ ఇందిరాగాంధీకి ఉత్తరాధికారి కావాలనే కలలు సాధ్యమా.. అన్నారు. పాకిస్థాన్‌ దేశస్తులు మీడియాతో మాట్లాడినవేళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్దరామయ్యలు మాట్లాడిన వీడియోలను వాడుతున్నారని, ఇది దేనికి సంకేతమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 02:00 PM