Monkey Attack: బిహార్‌లో విషాదం.. కోతుల దాడిలో వృద్ధుడు మృతి..
ABN, Publish Date - Aug 18 , 2025 | 07:28 AM
కోతుల ఆగడాలు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. ఇంటి ముందు పశువుల కోసం మేత సేకరిస్తున్న వృద్ధుడిపై అకస్మాత్తుగా పదుల సంఖ్యలో కోతులు వచ్చి దాడి చేశాయి. బిహార్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
బిహార్‌లో ఓ భయానక ఘటన జరిగింది. షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం తన పశువుల కోసం మేత సేకరిస్తున్నాడు 67 ఏళ్ల వృద్ధుడు. అతడిపై 20 కి పైగా కోతుల గుంపు ఉప్పెనలా మీద పడి అటాక్ చేశాయి. ఇష్టమొచ్చినట్లు గాయపరిచాయి. వృద్ధుడి కేకలు విని అతడ్ని రక్షించడానికి స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మధుబని సదర్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ వృద్ధుడి ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, మృతుడు రామ్‌నాథ్ చౌదరి లోహత్ షుగర్ మిల్లులో క్లర్క్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆదివారం ఉదయం రామ్‌నాథ్ తన ఇంటి సమీపంలో పశువుల కోసమని మేత సేకరిస్తున్నాడు. ఈ సమయంలో 20 నుండి 25 కోతుల గుంపు అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. కోతులు అతని చేతులు, కాళ్ళు, శరీరంలోని ఇతర భాగాలను కొరికి తీవ్రంగా గాయపరిచాయి. వృద్ధుడి ఆర్తనాదాలు విన్న స్థానిక ప్రజలు ఆందోళనతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన చౌదరిని సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 18 , 2025 | 07:46 AM