Trains: ఐదు నిమిషాల్లో ఫుల్..
ABN, Publish Date - Aug 19 , 2025 | 11:15 AM
దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లు బుకింగ్స్ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో బుకింగ్ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా ఫుల్ అయ్యాయి.
దీపావళి స్పెషల్ రైళ్ల టిక్కెట్ల రిజర్వేషన్
2 రోజులకు ముందే సొంతూళ్లకు పయనం
చెన్నై: దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లు బుకింగ్స్ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో బుకింగ్ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా ఫుల్ అయ్యాయి. దీపావళి పండుగ కోసం సొంతూళ్లకు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్ళలో ప్రయాణించే వారు 60 రోజులకు ముందుగానే టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
ఇందులోభాగంగా, సోమవారం ఈ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమైంది. అక్టోబరు 17వ తేదీ శుక్రవారం రోజున సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు పోటీపడ్డారు. ఈ ముందస్తు రిజర్వేషన్ ప్రారంభమైన వెంటనే అన్ని టిక్కెట్లు కొన్ని క్షణాల్లోనే అమ్ముడు పోయాయి. ముఖ్యంగా మదురై, తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుక్కుడి, కన్నియాకుమారి, తిరుచ్చెందూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని సెకండ్ క్లాస్ టిక్కెట్లన్నీ 5 నిమిషాల్లో బుక్ అయ్యాయి. అదేవిధంగా తిరుచ్చి, రామేశ్వరం, కుంభకోణం, తంజావూరు ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లలో కూడా టిక్కెట్లు ఫుల్ అయ్యాయి.
కోయంబత్తూరు, ఈరోడ్, తిరుపూరు వైపు వెళ్లే చేరన్, ఏర్కాడు, బ్లూమౌంటైన్ తదితర ఎక్స్‌ప్రె్‌సలలో కూడా టిక్కెట్లు ఫుల్ అయ్యాయి. ఈ టిక్కెట్లలో అత్యధిక భాగం ఆన్‌లైన్‌లోనే బుక్ కావడం గమనార్హం. ఈ టిక్కెట్ల కోసం రిజర్వేషన్ కౌంటర్ల వద్ద క్యూలలో గంటల తరబడి నిలబడివున్న పలువురు ప్రయాణికులు ఊసురుమంటూ వెనుదిరిగారు. బస్సులతో పోల్చితే చార్జీలు తక్కువగా ఉండడంతో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 19 , 2025 | 11:15 AM