Home » Diwali
దీపావళి పండుగ ముగిసినా.. ఇప్పటికీ టపాసుల మోత మాత్రం ఆగట్లేదు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల దీపాలు కనువిందు చేస్తూనే ఉన్నాయి. దీపావళికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా వివిధ రకాల టపాసుల వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. అయితే..
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 4,829 మద్యం దుకాణాల్లో మూడు రోజుల్లో రూ.790 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగ జరుపుకున్నారు.
దీపోత్సవ్ సెలబ్రేషన్స్ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అఖిలేష్ యాదవ్ నిలదీశారు. దీపావళి పండుగను క్రిస్మస్ పండుగతో పోల్చి వాళ్ల నుంచి నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
దీపావళి సందర్భంగా న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ జంక్షన్‌తో సహా పలు ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నార్తరన్ రైల్వే అదనపు టిక్కెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా పెంచింది.
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పర్వదినం చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, వాటిని శ్రీకృష్ణునికి సమర్పించి, ఆపై ఇంటి ప్రాంగణంలో వరుసలలో అమర్చుతారు.
దీపావళి ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈపండగ ఆనవాళ్లున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో ముంచే శాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతార మెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు.
దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల సంతల్లో గొర్రెల విక్రయాలు వారం రోజుల ముందునుంచే ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో ఉన్న కొత్తాంబాడి పరిధిలోని కల్పకనూర్‌లో గురువారం పశువుల సంతలో గొర్రెలు, పశువులు, కోళ్ళు తదితరాల విక్రయాలు జోరందుకున్నాయి.
రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. అలాగే, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5,308 మంది కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్ మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా రవాణా శాఖలో పనిచేస్తున్న 1,05,955 మంది ఉద్యోగులకు బోనస్, గ్రాట్యుటీ నిధిగా రూ.175.51 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు తెలిపారు.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.
దీపావళి, చాట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.