Share News

Diwali: దీపావళి ఎఫెక్ట్.. జోరుగా గొర్రెల విక్రయాలు

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:43 PM

దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల సంతల్లో గొర్రెల విక్రయాలు వారం రోజుల ముందునుంచే ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో ఉన్న కొత్తాంబాడి పరిధిలోని కల్పకనూర్‌లో గురువారం పశువుల సంతలో గొర్రెలు, పశువులు, కోళ్ళు తదితరాల విక్రయాలు జోరందుకున్నాయి.

Diwali: దీపావళి ఎఫెక్ట్.. జోరుగా గొర్రెల విక్రయాలు

చెన్నై: దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల సంతల్లో గొర్రెల విక్రయాలు వారం రోజుల ముందునుంచే ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సేలం జిల్లా ఆత్తూరు(Attur) సమీపంలో ఉన్న కొత్తాంబాడి పరిధిలోని కల్పకనూర్‌లో గురువారం పశువుల సంతలో గొర్రెలు, పశువులు, కోళ్ళు తదితరాల విక్రయాలు జోరందుకున్నాయి. రోజుకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు అమ్మకాలు సాగుతుండటంతో వ్యాపారులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.


nani6.jpg

పండుగను పురస్కరించుకుని నాలుగు వారాల క్రితం ఈ ప్రాంతంలో ప్రారంభించిన పశువుల సంత ప్రతి బుధవారం కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటుంది. ఒక్క బుధవారం రోజున మాత్రం సుమారు రూ.కోటికి పైగా వ్యాపారం జరిగిందని రైతులు సంతోషం వ్యక్తంచేశారు. కాగా, పండుగ సందర్భంగా మామూలు రోజులకంటే అధికంగా గొర్రెల అమ్మకాలు సాగుతుండటంపై రైతులు కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు.


nani6.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

సంభావన పథకానికి టీటీడీ నిధులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2025 | 12:43 PM