Share News

Diwali Bonus: రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌..

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:19 PM

రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ ప్రకటించారు. అలాగే, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5,308 మంది కార్మికులకు కూడా బోనస్‌ ప్రకటించారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా రవాణా శాఖలో పనిచేస్తున్న 1,05,955 మంది ఉద్యోగులకు బోనస్‌, గ్రాట్యుటీ నిధిగా రూ.175.51 కోట్లు వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేసినట్లు తెలిపారు.

Diwali Bonus: రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌..

చెన్నై: రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగులకు దీపావళి బోనస్‌(Diwali Bonus) ప్రకటించారు. అలాగే, చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5,308 మంది కార్మికులకు కూడా బోనస్‌ ప్రకటించారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Shivashankar) మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా రవాణా శాఖలో పనిచేస్తున్న 1,05,955 మంది ఉద్యోగులకు బోనస్‌, గ్రాట్యుటీ నిధిగా రూ.175.51 కోట్లు వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేసినట్లు తెలిపారు.

nani5.2.jpg


సహకార సంఘాల ఉద్యోగులకు 20 శాతం...

సహకార సంఘాల ఉద్యోగులకు 20 శాతం దీపావళి బోనస్‏ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో... సహకార సంఘాలకు కేటాయించిన మిగులు పరిగణలోకి తీసుకుని 20 శాతం బోసన్‌ ఇస్తున్నట్లు తెలిపింది. మిగులు లేని సంఘాల్లో పనిచేసే వారికి 10 శాతం బోనస్‌, గ్రాట్యుటీ అందిస్తున్నామని, అలాగే, నికర లాభం పొందని ఉద్యోగులకు రూ.2,400 గ్రాట్యుటీ అందజేయనున్నట్లు తెలిపింది. ఆ ప్రకారం, 44,081 మంది ఉద్యోగులకు రూ.44.11 కోట్లు బోనస్‌, గ్రాట్యుటీగా అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

nani5.3.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

సంభావన పథకానికి టీటీడీ నిధులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2025 | 12:19 PM