Diwali: నరకచతుర్దశి ... జీవన మార్గదర్శి
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:19 AM
దీపావళి ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈపండగ ఆనవాళ్లున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో ముంచే శాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతార మెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు.
భారతీయ సనాతన ధర్మంలోని పండగలు, సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ మానవాళికి జీవన మార్గ దర్శకాలుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిందే నరకచతుర్దశి. దీపావళి పండగకు అటుఇటు ధనత్రయోదశి, నరకచతుర్దశి, భగీనీ హస్తభోజనం లేదా యమవిదియ అనే పర్వదినాలుంటాయి. వాటిలో మిగతావాటి మాట ఎట్లున్నా నరకచతుర్దశి గురించి చిన్నాపెద్దా అందరికీ బాగా తెలుసుంటుంది. అయితే నరక చతుర్దశి కథ ఆంతర్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం జరుపుకొనే పండగల విలువేంటో బోధపడుతుంది.
దీపావళి ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈపండగ ఆనవాళ్లున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో ముంచే శాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతార మెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. అది సంధ్యాసమయం... నిషిద్ధ కాలం. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుని చూసి సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కనుక ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్పాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ‘ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు’ అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి ‘కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉంద’ని హెచ్చరించి వెళ్లిపోతాడు.
చెడు స్నేహ ప్రభావం...
ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి అప్పటికి సంతోషించింది. తనబిడ్డకు మంచి విద్యాబుద్థులు నేర్పించింది. పెరిగి పెద్ద యిన ఆ బిడ్డ ఎంతో శక్తిమంతుడిగా మారాడు. ఆ నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలి స్తుండేవాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లి లాగ భావిస్తూ చక్కగా పూజలు చేేసవాడు. తన రాజ్యంలోని ప్రజలందరిని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచాయి. ద్వాపర యుగంలో నరకుడికి పక్క రాజ్యమైన శోణిత పురానికి రాజైన బాణాసురునితో ేస్నహం ఏర్పడింది. బాణాసురుడు స్ర్తీలను హీనంగా చూస్తుండే వాడు. అతని దృష్టిలో స్ర్తీ ఒక భోగవస్తువు. ఈ ేస్నహ ప్రభావంతో నరకుడు కూడామెల్లిగా చెడుమార్గంలోకి మళ్లాడు. అమ్మవారి పూజలు ఆపేశాడు. ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలం దరిని బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధిస్తుండేవాడు. అలా అహంకారంతో అధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్న నరకుడు చేేసవన్నీ అసుర పనులే కనుక అతనిని ‘నరకాసురుడు’ అనేవారు. ధర్మ మార్గంలో నడుచుకునేవాడు దుర్మార్గుడితో ేస్నహం చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
ఒకసారి స్వర్గం మీదకు కూడా దండయాత్ర చేసి దేవతల తల్లి అయిన అదితి మాత చెవి కుండలాలను దొంగిలించి దేవతలను, దేవ మాతను అవమానించాడు. ఒక్క అదితి దగ్గర కుండలాలనే కాదు... వరుణ దేవుడి దగ్గర ఛత్రం... ఇలా దేవతల పవిత్ర చిహ్నాలు, ఆయుధాలు ఎన్నింటినో దౌర్జన్యం చేసి తెచ్చు కొనేవాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి నరకుడు పెడుతున్న బాధలన్నీ వివరించి, తమను కాపాడమని ప్రార్థించారు.
అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణునికి భార్యగా ఉంది. ఆ సత్యభామనరకసంహారానికి వెళు తున్న కృష్ణుడితో తానూ యుద్ధానికి వస్తానని అంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్య భామతో కలసి ప్రాగ్జ్యోతిష్యపురంపైకి యుద్ధానికి వెళ్లాడు.

అక్కడ శ్రీ కృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధంజరిగింది. దైవ సంకల్పం ప్రకారం శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో కాస్త అలసినట్లు సొమ్మసిల్లాడు. కళ్ళముందు భర్త సొమ్మసిల్లటం చూసిన సత్యభామ వెంటనే తాను విల్లందుకుంది. వెంటనే కృష్ణుడు కూడా తేరుకుని యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో నరకాసురుడు మరణించాడు. అప్పుడు నరకాసురుడు తన తల్లి భూదేవి అంశతో జన్మించిన సత్యభామ చేతుల్లో మరణించినట్టయింది. ఆ వెంటనే కృష్ణుడు నరకుడి చెరలో ఉన్న రాకుమార్తెలను విడిపించి తన వెంట తీసుకెళ్లాడు. అలాగే దేవతల దగ్గర తెచ్చిన విలువైన వస్తువులు, ఆభరణాలన్నింటిని ఎవరివి వారికి అంద జేశాడు కృష్ణుడు. నరకుడు మరణించినరోజుని ‘నరక చతుర్దశి’గా ఆరోజు నుంచి ప్రజలంతా ఆనందంగా పండుగలా జరుపుకోవటం ఆచర ణలోకొచ్చింది. ఆ తరువాత రోజు, అంటే ఆశ్వీయుజమాస అమావాస్య నాడు ‘దీపావళి’ పండుగ జరుపుకుంటారు. ఒక అసురుడి పీడ విరగడ అయిందన్న ఆనందంతో చీకటిలాంటి కష్టాలు తొలగి ఆనందం లాంటి వెలుగులు వచ్చాయన్న సంతోష నేపథ్యం ఇలా దీపావళి పండగకు ఉంది.
జీవన మార్గదర్శక సూత్రాలివే...
నరక చతుర్దశి నేపథ్యంలో పనికొచ్చే జీవన మార్గదర్శక సూత్రాలున్నాయి. సంతానకాంక్షతో దాంపత్య జీవితం గడపాలనుకునే దంపతులు సంధ్యాసమయాల్లాంటి నిషిద్ధ సమయాలలో కలవకూడదు. అలాగే పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించటంతోపాటు వారు చేసే స్నేహాలను కూడా పెద్దలు గమనిస్తుండాలి. నరకుడు బాణాసురుడితో స్నేహానికి ముందు బాగానే ఉన్నాడు. ఆ అసురుడితో స్నేహం చేశాకే తాను కూడా అసురుడై మరణించాడు. అలాగే తప్పు చేసినప్పుడు పెద్దలు తమ పిల్లలను వెనుకేసు కుని రాకూడదు. విష్ణువు అంశతో జన్మించిన కృష్ణుడిలాగా, భూదేవి అంశతో జన్మించిన సత్యభామలాగా నిష్ఫక్షపాతంగా ధర్మం వైపు ఉండాలి. ఇలాంటి జీవన మార్గదర్శకాలు నరక చతుర్దశి ఆవిర్భావం వెనక కనిపిస్తున్నాయి.
- శ్రీమల్లి, 98485 43520