TGSRTC: దీపావళి పండగ ఎఫెక్ట్.. పేలుతున్న టికెట్ ధరలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 07:12 AM
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.
- రూ.500 టికెట్‌కు రూ.1,500 వరకు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
హైదరాబాద్ సిటీ: దీపావళి(Diwali) నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్(Hyderabad) వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా రూ.500 ఉంటే టికెట్ ధరను రూ.1000 నుంచి రూ.1500 వరకు పెంచేశారు. టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు దోచుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడపనున్నాయి.

దీపావళి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 17 నుంచి 23 వరకు 26 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల(Secunderabad, Nampally, Kacheguda, Cherlapally, Lingampally Station) నుంచి తిరుపతి, విజయవాడ, భువనేశ్వర్, చెన్నై, యశ్వంత్‌పూర్ ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతోంది. విమాన టికెట్ల బుకింగ్ కూడా గత ఏడాది దీపావళితో పోలిస్తే 15-20 శాతం పెరిగిందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. 65-70 శాతం విహార యాత్రలకు సంబంధించినవి ఉన్నాయన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News
