Diwali Jugaad Viral Video: మిరపకాయలతో దీపావళి సంబరాలు.. ఇతడి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:30 PM
దీపావళి పండుగ ముగిసినా.. ఇప్పటికీ టపాసుల మోత మాత్రం ఆగట్లేదు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల దీపాలు కనువిందు చేస్తూనే ఉన్నాయి. దీపావళికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా వివిధ రకాల టపాసుల వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. అయితే..
దీపావళి పండుగ ముగిసినా.. ఇప్పటికీ టపాసుల మోత మాత్రం ఆగట్లేదు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల దీపాలు కనువిందు చేస్తూనే ఉన్నాయి. దీపావళికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా వివిధ రకాల టపాసుల వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న దీపావళి వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఓ వ్యక్తి మిరపకాయలతో దీపావళి సంబరాలు చేశాడు. మిరపకాయలతో దీపావళి ఏంటీ... అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దీపావళి (Diwali) రోజున ఇంట్లో మిరపకాయలు (Chilies) కట్ చేస్తున్నాడు. దీపావళి కాబట్టి.. మిరపకాయలతో ప్రత్యేకమైన వంటకం ఏదైనా చేస్తున్నాడేమో అని అనకుంటే పొరపడ్డట్లే. ఎరుపు, పచ్చని మిరపకాయలను తీసుకున్న అతను.. వాటికి కాండాలను కత్తిరించాడు. ఆ తర్వాత మిరపకాయ లోపలి విత్తనాలను బయటికి తీసేసి సిద్ధం చేసుకున్నాడు.
చివరగా వాటిని ఇంటి బయట ఉన్న చిన్న చిన్న దీపాలకు తొడిగాడు. ఇలా పచ్చని, ఎరుపు రంగులో ఉన్న మిరపకాయలను (Man Attaching Chilies on lights) ఒకదాని తర్వాత ఒకటిగా లైట్లకు మొత్తం తొడిగేశాడు. మొత్తం తొడిగిన తర్వాత.. లైట్లు ఆన్ చేయగా.. పచ్చని, ఎర్రని రంగులో ఆ దీపాలన్నీ మరింత కాంతివంతంగా మారాయి. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఆ వ్యక్తి మిరపకాయలతో వినూత్న ప్రయోగం చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడన్నమాట.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి జుగాద్‌లు చేయడంలో భారతీయులకు మించిన వారు లేరు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,600కి పైగా లైక్‌లు, 4.68 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి