Pakistan Train Video: ఇంతకీ ఇది పాకిస్తానేనా.. రైలు వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..
ABN , Publish Date - Oct 22 , 2025 | 06:32 PM
పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. లోపల ఏర్పాట్లు చూసి షాక్ అయ్యాడు. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న అతడికి లోపలి దృశ్యాలు షాక్‌కు గురి చేశాయి. సాధారణంగా..
పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా కనిపిస్తుంటాయి. అయితే ఏ వీడియోలో చూసినా అక్కడి దుర్భుర పరిస్థితులు, పేదరికం, మరోవైపు ఆ దేశ పరిస్థితులను ఎండగడుతూ అక్కడి వారు చేసే వింత వింత ప్రయోగాలే గుర్తుకొస్తుంటాయి. ఇక అక్కడి వాహనాలతో పాటూ రైళ్లకు సంబంధించిన వీడియోలు కూడా నిత్యం చూస్తుంటాం. పాకిస్తాన్ రైల్లు అంటేనే లోపల ఊడిపోయిన కుర్చీలు, పేరుకుపోయిన చెత్తాచెదారం గుర్తుకొస్తుంది. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ రైలును చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో.. ఇంతకీ ఇది పాకిస్తానేనా.. లేక అమెరికానా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ రైల్లో (Pakistan Train) ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. లోపల ఏర్పాట్లు చూసి షాక్ అయ్యాడు. ఏసీ బోగీలో (AC bogie) ప్రయాణిస్తున్న అతడికి లోపలి దృశ్యాలు షాక్‌కు గురి చేశాయి. సాధారణంగా పాకిస్తాన్ రైలు అంటేనే అపరిశుభ్రతకు నిలయమని అనుకుంటారు. కానీ ఈ రైలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
లోపల సీటింగ్ దగ్గర నుంచి భోజనాల వరకూ ఏర్పాట్లన్నీ (Modern facilities in train bogie) లగ్జరీగా ఉన్నాయి. బోగీలోకి వెళ్లగానే ముందుగా శుభ్రంగా ఏర్పాటు చేసిన పరుపు కనిపిస్తుంది. ఆ పక్కనే స్విచ్ బోర్డుల దగ్గర నుంచి ఫ్యాన్లు, లైట్లు ఇలా అన్నీ అధునాతనంగా కనిపిస్తాయి. అలాగే సీటింగ్ కూడా ఎంతో అందంగా డిజైన్ చేయడం చూడొచ్చు. దీంతో పాటూ భోజనం, స్కాక్స్.. ఇలా అనేక రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే మధ్యలో జ్యూస్చ స్వీట్లు, చపాతీ కూడా అందించారు.
ఇలా మొత్తానికి పాకిస్తాన్‌లో రైలు ప్రయాణం ఆ యువకుడికి మధురానుభూతిని మిగుల్చింది. తన అనుభవాన్ని వివరిస్తూ అతను వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘దీని కంటే అత్యాధునిక రైళ్లు మన ఇండియాలో చాలా ఉన్నాయి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సౌకర్యాలు మన వద్ద సాధారణ థర్డ్ ఏసీ కోచ్‌లోనే అందుబాటులో ఉంటాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లు, 4.12 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి