Funny Viral Video: ప్రసాదం కోసం చేయి చాపితే.. ప్రాణాలు తీసేంత పని చేశారుగా..
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:37 PM
విగ్రహ నిమజ్జనం పూర్తి చేసుకున్న కొందరు భక్తులు.. లారీలో తిరిగి వస్తున్నారు. కొందరు యువకులు లారీకి ఓ వైపు కాళ్లు కిందకు వేసుకుని కూర్చున్నారు. వారిలో ఓ వ్యక్తి ప్రసాదం గిన్నె పట్టుకుని ఉన్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో కళ్ల ముందు ఏం కనిపించినా.. వెంటనే అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. చూసే ఓపిక ఉండాలే గానీ స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే.. వీడియోలు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని షాక్‌కు గురి చేస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా ఇలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లారీలో వెళ్తున్న భక్తులను.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి ప్రసాదం అడిగాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. విగ్రహ నిమజ్జనం పూర్తి చేసుకున్న కొందరు భక్తులు.. లారీలో తిరిగి వస్తున్నారు. కొందరు యువకులు లారీకి ఓ వైపు కాళ్లు కిందకు వేసుకుని కూర్చున్నారు. వారిలో ఓ వ్యక్తి ప్రసాదం గిన్నె (Prasad bowl) పట్టుకుని ఉన్నాడు. అది చూసి అంతా.. ఆ గిన్నెలో ప్రసాదం ఉందేమో అనుకున్నారు. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు.
దీంతో లారీకి సమీపంగా వెళ్లి.. ‘సోదరా ఏం పంచుతున్నావు.. కొంచెం ప్రసాదం నాక్కూడా పెట్టు’.. అంటూ చేయి చాపాడు. లారీపై ఉన్న వ్యక్తి కూడా ఎంతో సంతోషంగా గిన్నెలో నుంచి ఏదో బయటికి తీశాడు. అంతా అది ప్రసాదం అని అనుకున్నారు. కానీ తీరా బయటికి తీయగా.. అతడి చేతిలో ప్రసాదానికి బదులుగా (Snake in the Prasad bowl) ప్రాణాలతో ఉన్న పాము కనిపించింది. దాన్ని చూడగానే స్కూటీపై ఉన్న వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రసాదం అనుకుంటే ప్రాణాలు తీసేలా ఉన్నాడే’.. అంటూ కొందరు, ‘హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది కదరా బాబోయ్’.. అంటూ మరికొందరు, ‘ప్రాణాలు తీసే ప్రసాదం అంటే ఇదేనేమో’.. అంటూ ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా లైక్‌లు, 35.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి