Diwali UNESCO: దీపావళి పండుగకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు..
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:08 PM
మనదేశ వాసులు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మనదేశ వాసులు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం (Diwali Intangible Cultural Heritage).
ఈ సమావేశాలు డిసెంబర్ 8న ప్రారంభమ్యాయి. 13వ తేదీ వరకు జరగనున్నాయి. యునెస్కో ఇప్పటికే భారత్‌కు చెందిన 15 అంశాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో ఇంతకు ముందు కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామలీల మొదలైనవి ఉన్నాయి. తాజాగా యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది (UNESCO heritage list).
ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వందల మంది ప్రతినిధులు వచ్చారు (Indian festivals UNESCO). కాగా, హిందువులు చేసుకునే అత్యంత సాంప్రదాయ పండుగలలో దీపావళి అతి ముఖ్యమైనది. ఈ పండుగను యునెస్కో జాబితాలో చేర్చడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News