Festival Special Trains: పండుగ ప్రయాణికుల కోసం నార్త్ రైల్వే 17 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Oct 19 , 2025 | 08:12 PM
దీపావళి సందర్భంగా న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ జంక్షన్‌తో సహా పలు ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నార్తరన్ రైల్వే అదనపు టిక్కెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా పెంచింది.
న్యూఢిల్లీ: దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల 20వ తేదీన ఢిల్లీలోని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి పలు కీలక నగరాలకు 17 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ నుంచి బిహార్, జార్ఖాండ్, ఈశాన్య భారతంలోని పలు సిటీలను కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.
పండుగ ప్రత్యేక రైళ్లు న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ జంక్షన్‌తో సహా పలు ప్రధాన స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నార్తరన్ రైల్వే అదనపు టిక్కెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా పెంచింది.
భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన 17 ప్రత్యేక రైళ్లు పాట్నా, లక్నో, దర్బంగా, మనసి, ధన్‌బాద్, భాగల్‌పూర్, సీతామర్హి, హౌరా, పాటలీపుత్ర, హనన్‌పూర్ రోడ్, దానాపూర్, గయ, ప్రయాగ్‌రాజ్ వంటి కీలక నగరాలకు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నడుపుతున్న ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్‌తోనే ప్రయాణించాల్సి ఉంటుంది. కాగా, ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి ముందు రైళ్ల టైమింగ్, ఎక్కడెక్కడ ఆగుతాయో వెరిఫై చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది. 139 నుంచి అప్డేట్ సమాచారం తెలుసుకోవచ్చని, అఫీషియల్ ఇండియన్ రైల్వే ఎంక్వయిరీ వెబ్‌సైట్ www.enquiry.indianrail.gov.in. లోనూ సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
26 లక్షల దీపాలతో అయోధ్య ప్రపంచ రికార్డు
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి