Hero Vijay: హీరో విజయ్ ధీమా.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే..
ABN, Publish Date - Aug 19 , 2025 | 10:58 AM
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు.
చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు. మన లక్ష్యాన్ని చేరుకునేందుకు, మన కలల్ని నెరవేర్చుకునేందుకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉందన్నారు.
1967, 1977లో వచ్చిన ఎన్నికల ఫలితాలను మళ్లీ 2026లో చూడబోతున్నామని వెల్లడించారు. మహా ప్రజాశక్తిగా ఉన్న మీరంతా కలిసి ఈ కలను నెరవేర్చబోతున్నట్టు పేర్కొన్నారు. ‘తమిళ ప్రజలను ప్రాణానికి ప్రాణంగా భావించే ఈ విజయ్ గురించి మీకు బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ విజయం కోసం అభిమానులు, యువతీ యువకులు, మహిళలు,
పురుషులు, వృద్ధులు ఇలా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు. కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనసాక్షి ఉన్న ప్రజాపాలన అందిస్తామని, ఇందుకోసం అధికార లక్ష్యం దిశగా పయనిస్తామని, వచ్చే ఎన్నికల్లో తమిళ గడ్డపై సరికొత్త ఫలితాన్ని చూపించడం ఖాయమన్నారు. ఎన్నికలు అనే రాజకీయ యుద్ధంలో గెలుస్తామని, అంతా మంచే జరుగుతుందని, విజయం తథ్యమని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 19 , 2025 | 10:58 AM