Cleaning Tips: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు.. జస్ట్ ఇలా చేయండి..
ABN, Publish Date - May 04 , 2025 | 03:34 PM
Cleaning Tips: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లోకి చేరవు.
ఇది వరకు పాము కుడితే చనిపోయేవారు. కానీ ప్రస్తుతం దోమ కుడితేనే చనిపోయే పరిస్థితులు దాపురించాయి. అంతేకాదు.. దోమల వల్ల సంక్రమించే వ్యాధులు సైతం బాగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో నేలను తుడుచేందుకు.. మార్కెట్లో లభించే రసాయనాలను ఉపయోగించకుండా జస్ట్. కొన్ని సింపిల్ చిట్కాలు పాటిస్తే చాలు.
భారీ వర్షాల కారణంగా.. ఇంటి చుట్టూ నీరు నిలిచిపోతుంది. దీంతో ఇంట్లోకి చీమలు, దోమలు, ఈగలు రావడం ప్రారంభమవుతోంది. వర్షం కారణంగా.. అవి వంటగది, బాత్రూమ్ మురుగు కాలువల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల ఆహారం సైతం కలుషితం అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. నేలను తుడుచేటప్పుడు నీటిలో కొద్దిగా డిష్ సోప్ కలపండి.
ఈ రెండు వస్తువులను మీరు తుడిచే నీటిలో వేస్తే..
ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయాలి. రసాయన పురుగు మందులను..నేల శుభ్రపరిచే ద్రవాన్ని వాడే బదులు.. పటిక, నిమ్మరసాన్ని నీటిలో కలిపి వాడాలి.
ముఖ్యంగా పటికను ఉపయోగించడం వల్ల కీటకాలు చనిపోతాయి. ఇది పురుగు మందులా పని చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. నీటిలో ముంచి నేలను తుడవడం ద్వారా.. నేలపై ఉన్న అన్ని కీటకాలు, ఈగలు, చీమలు, బొద్దింకలు సైతం పారిపోతాయి.
అగర్ వుడ్తోపాటు నిమ్మకాయ నీటిని కలిపి బొద్దింకలు, చీమలు కనిపించే ప్రదేశాలలో పిచికారీ చేయాలి. వంటగది, బాత్రూమ్, టాయిలెట్ డ్రెయిన్ల చుట్టూ దీన్ని స్ప్రే చేయాలి.
చీమలు, ఈగలు వంటి చిన్న కీటకాలను నిమ్మకాయ దూరంగా ఉంచుతుంది. ఒక నిమ్మకాయ రసం, అల్లం పొడిని క్రమం తప్పకుండా కడిగే నీటిలో కలపండి.
నిమ్మకాయల వాసన బలంగా ఉంటుంది. అందుకే ఈ చిన్న జీవులన్నీ ఇంటికి దూరంగా ఉంటాయి. ఇది అద్భుతమైన, శక్తివంతమైన సహజ పురుగుమందుగా పని చేస్తుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా నేలను శుభ్రం చేయడం వల్ల ఇళ్లలో క్రిములు దాదాపుగా లేకుండా పోతాయి.
ఇవి కూడా చదవండి
Jammu and Kashmir: లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
India Vs Pakistan: భారత్తో యద్ధంపై స్పందించిన పాక్ రాయబారి
Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు
Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం
Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్
Updated Date - May 04 , 2025 | 03:34 PM