ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IRCTC Tour Package: IRCTC ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ.. మాతా వైష్ణోదేవి సహా ఎన్నో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల సందర్శన..

ABN, Publish Date - Jun 07 , 2025 | 02:32 PM

IRCTC Mata Vaishno Devi Tour 2025: దేశవిదేశాల్లోని ప్రముఖ్య పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఉత్తరభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్ లో దర్శించుకోవాలని కోరుకునే దక్షిణాది భారతీయుల కోసం భారత్ గౌరవ టూరిస్ట్​ ట్రైన్ ఓ ప్యాకేజీ ప్రకటించింది.

IRCTC Mata Vaishno Devi Tour Package

IRCTC Bharat Gaurav Train Spiritual Package: దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటక ప్రియుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రత్యేక యాత్రా ప్యాకేజీలను అందిస్తోంది. దేశవిదేశాల్లోని ప్రముఖ పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను చౌక ధరలోనే కుటుంబసమేతంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. అదే విధంగా భారత గౌరవ టూరిస్ట్​ రైలు ద్వారా ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శించుకునేందుకు మరో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు నార్త్ ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను భక్తులు విజిట్ చేయవచ్చు. ప్యాకేజీ టూర్ వివరాలు, టికెట్ ధర, ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..


భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) 'మాతా వైష్ణో దేవీ విత్​ హరిద్వార్​ రిషికేశ్​ యాత్ర' పేరిట ప్యాకేజీ టూర్ నిర్వహిస్తోంది. భారత్ గౌరవ్ రైళ్ల ద్వారా ప్రయాణీకులు ఈ యాత్రను ఆస్వాదించవచ్చు. మాతా వైష్ణో టూర్ ప్యాకేజీలో భాగంగా యాత్రికులు శ్రీ మాతా వైష్ణోదేవి, హరిద్వార్‌, రిషికేశ్‌, ఆగ్రా, మథుర వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించవచ్చు. మొత్తం యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటుంది.


ప్యాకేజీ వివరాలు:

  • ప్యాకేజీ పేరు: మాతా వైష్ణోదేవి విత్ హరిద్వార్-ఋషికేశ్ యాత్ర

  • యాత్ర వ్యవధి: 9 రాత్రులు, 10 రోజులు

  • ప్రయాణ మార్గం: విజయవాడ నుండి ప్రారంభమై, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట, నాగ్‌పూర్, అగ్రా, మథుర, కట్రా, హరిద్వార్, ఋషికేశ్, తిరిగి విజయవాడ వరకు

  • ప్రయాణ వాహనం: భారత్ గౌరవ్ టూరిస్టు రైలు

  • యాత్రా కోడ్: SCZBG31


ప్యాకేజీ ధరలు:

  • స్లీపర్ : పెద్దలకు- రూ.17,940, పిల్లలకు (5–11 సంవత్సరాలు)-రూ.16,820

  • 3AC : పెద్దలకు- రూ.29,380, పిల్లలకు (5–11 సంవత్సరాలు)- రూ.28,070

  • 2AC : పెద్దలకు- రూ.38,770, పిల్లలకు (5–11 సంవత్సరాలు)- రూ.37,200


భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్యాకేజీలో భాగంగా ఉన్న ప్రాంతాలను యాత్రికులు సందర్శిస్తారు. టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్యాకేజీలో భాగమే. ప్రయాణ మార్గంలో స్థానిక రవాణా ఖర్చులు, హోటల్‌లో వసతి, ప్రతి గమ్యస్థానంలో IRCTC గైడ్ సేవలు, ప్రయాణికుల భద్రత కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్యాకేజీ కింద లభించే ఇతర సౌకర్యాలు. అయితే, ఇతరత్రా ఖర్చులు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.


వాస్తవానికి IRCTC ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది వేసవి సమయంలో ఈ యాత్రను నిర్వహిస్తుంటుంది. ఈ ప్యాకేజీ ఏప్రిల్ 1, 2025వ తేదీన ఆల్రెడీ పూర్తయింది. మీరు ఈ తేదీని కోల్పోతే తదుపరి తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. అయితే, ఈ నెలలోనే ఉత్తర భారత పుణ్యక్షేత్రాలు చూడాలనుకునే వారు ఢిల్లీ, లక్నో ,షాజహాన్‌పూర్ , సుల్తాన్‌పూర్, వారణాసి, జౌన్‌పూర్ జంక్షన్, మొరాదాబాద్, కోల్‌కతా వంటి పలు ప్రాంతాల నుంచి కూడా వెళ్లవచ్చు. మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) టూరిజం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.


ఇవీ చదవండి:

డార్క్ టూరిజం అంటే ఏంటి.. యువతలో పెరుగుతున్న కొత్త ...

IRCTC: తిరుపతికి చౌక టూర్ ప్యాకేజీ..పిల్లలతో సహా ఇలా ఈజీగా ...

మరిన్ని లైఫ్ స్టైల్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 07 , 2025 | 03:54 PM