Trump : అక్టోబర్‌లో దక్షిణ కొరియా పర్యటనకు ట్రంప్!, జిన్‌పింగ్‌తో భేటీకి ప్రయత్నాలు
ABN, Publish Date - Sep 07 , 2025 | 07:18 AM
డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అటు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో కూడా మరోసారి..
ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహాదారుల బృందం దక్షిణ కొరియా పర్యటనకు సైలెంట్‌గా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమ్మిట్ కోసం ట్రంప్, సౌత్ కొరియాకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే, ఈ పర్యటకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
అమెరికా అధ్యక్షుడు ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశానికి రెడీ అవుతున్నట్టు ట్రంప్ పరిపాలన అధికారులు చెప్పారని సీఎన్ఎన్ వెల్లడించింది. అక్టోబర్ చివరి వారంలో జియోంగ్జులో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశం కావడానికి ఒక కీలకమైన అవకాశంగా ట్రంప్ భావిస్తున్నట్లు కూడా CNN వెల్లడించింది. APEC సందర్భంగా ద్వైపాక్షిక సమావేశం గురించి తీవ్రమైన చర్చలు జరిగాయని తెలిపింది.
అమెరికాకు అదనపు ఆర్థిక పెట్టుబడులను పొందేందుకు ఈ పర్యటన ఒక అవకాశంగా ట్రంప్ చూస్తున్నారని సదరు అధికారులు వెల్లడించినట్టు సీఎన్ఎన్ పేర్కొంది. దక్షిణ కొరియా పర్యటనపై చర్చలు జరుగుతున్నాయని.. ఇది ఆర్థిక సహకారంపై ఎక్కువగా దృష్టి పెడుతుందని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పినట్టు CNN చెబుతోంది. వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం గురించిన చర్చలపై దృష్టి పెట్టడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి ట్రంప్ సమావేశం కావాలని చూస్తున్నట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. అయితే, కిమ్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది తేలాల్సిఉంది.
ఇవి కూడా చదవండి
కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా
Updated Date - Sep 07 , 2025 | 07:26 AM