ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Protests: భారతీయుల వర్క్‌ పర్మిట్లు రద్దు చేయాలని బంగ్లాదేశ్‌లో నిరసన

ABN, Publish Date - Dec 29 , 2025 | 11:10 AM

బంగ్లాదేశ్‌లో హింస చెలరేగుతోంది. తమ నేత హాదీని హత్యచేసిన ఇద్దరు వ్యక్తులు భారత్‌లో ఉంటున్నారని ఆరోపిస్తూ.. తాజాగా భారత్‌ వ్యతిరేక నిరసనలు చేపట్టింది ఇంకిలాబ్ మోంచా. అక్కడి భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.

Bangladesh Protests

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ రాడికల్ నేత, ఇంకిలాబ్ మోంచా ఫౌండర్.. షరీఫ్ ఉస్మాన్ హదీ(Osman Hadi) హత్య అనంతరం ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హత్యతో ఆ దేశంలో రోజు రోజుకూ హింస చెలరేగుతోంది. తమ నేత హాదీని హతమార్చిన ఇద్దరు వ్యక్తులు భారత్‌లో తలదాచుకుంటున్నారనే ఆరోపణలతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వంపై ఇంకిలాబ్ మోంచా(Inqilab Moncho) మండిపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. బంగ్లాదేశ్‌లో నివాసముంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది(Yunus Govt in Bangladesh).

తమ నేత హదీ హత్యకు కారకులైన నిందితులను, సహకరించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి.. హదీకి న్యాయం చేయాలని ఆందోళన చేస్తోంది ఇంకిలాబ్ మోంచా. మరోవైపు.. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా(Shaik Haseena)కు ఇండియా ఆశ్రయం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో హసీనాను తమకు అప్పగించకపోతే.. భారత్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని యూనస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనకు పెద్దఎత్తున తరలిరావాలని ఆందోళనకారులకు పిలుపునిచ్చింది ఇంకిలాబ్ మోంచా.

భారత వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచా నేత ఉస్మాన్‌ హాదీ(32)పై ఈ నెల 12న ఢాకాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని చికిత్స నిమిత్తం సింగపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 18న మృతిచెందాడు. దీంతో ఆ దేశంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అక్కడి మీడియా సంస్థలు, అవామీ లీగ్‌ కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేశారు.

ఇవీ చదవండి:

ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..

ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు

Updated Date - Dec 29 , 2025 | 11:13 AM