Home » Bangladesh Protests
గత కొంత కాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. భారత వ్యతిరేక విద్యార్థి హడీ మరణం తర్వాత అతని మద్దతుదారులు రెచ్చిపోయారు. దైవ దూషణ ఆరోపణపై ఒక హిందూ బెంగాలీ కార్మికుడు దీపు చంద్ర దాస్ ని దారుణంగా హత్య చేశారు.
భారత్‌తో స్నేహం కొనసాగించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దింపడం కోసం జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు. భారత్‌కు వ్యతిరేకంగా పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఆరంభంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు హాదీపై దాడి చేశారు.
Sheikh Hasina: దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. అమెను అరెస్ట్ చేసేందుకు సహాయం చేయాలంటూ ఇంటర్ పోల్‌ను సైతం కోరింది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దాంతో పరిణామాలు తీవ్రంగా మారాయి.
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజాగ్రాహం వెల్లువెత్తింది. దీంతో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె భారత్ లో తలదాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది.
బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. పలువురు ఇస్లామిక్ వాదులు హిందువులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసి దేవాలయాలను ధ్వంసం చేయడంతోపాటు దాడులు చేసి దేశం విడిచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది.
ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో తమకు రక్షణ లేకుండా పోయిందని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం తమను దాడులు, వేధింపుల నుంచి రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 30 వేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు.
రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.
హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.