Share News

Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న మారణహోమం.. మరో హిందువు దారుణ హత్య

ABN , Publish Date - Jan 10 , 2026 | 08:40 PM

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇళ్లపై, వ్యాపార సంస్థలపై కొంతమంది అతివాదులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు హిందువులు చనిపోయారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న మారణహోమం.. మరో హిందువు దారుణ హత్య
Bangladesh Hindu Attacks

ఢాకా: కొంత కాలంగా బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో భాగంగా మరో హిందువు కన్నుమూశాడు. సునమ్‌గంజ్ జిల్లాలో ఓ అల్లరి మూక చేతుల్లో జై మహాపాత్రో అనే హిందువు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యోదంతం తీవ్ర కలకలం రేపుతోంది. మీడియా కథనాల ప్రకారం.. సునమ్‌గంజ్ జిల్లాలో జరిగిన భంగాడోహోర్ గ్రామంలో ఆర్థిక లావాదేవీల అంశాన్ని ఆధారంగా చేసుకొని గురువారం 19 ఏళ్ల జై మహాపాత్రపై అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తితోపాటు మరికొంత మంది దాడి చేశారు. ఈ దాడిలో మహాపాత్రో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.


ఈ హత్య వార్త తెలియగానే స్థానిక హిందూ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఢాకాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘జై మహాపాత్రోకు న్యాయం ’ కావాలంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య అనంతరం దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 35 రోజుల్లో 11 మంది హిందువుల చనిపోయినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి...

రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Updated Date - Jan 10 , 2026 | 09:28 PM