Smallest War: వార్ ఒన్ సైడ్ అంటే ఇదే.. ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధమిదే..
ABN, Publish Date - May 05 , 2025 | 12:25 PM
యుద్ధం అంటేనే మనకు ముందుగా.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు గుర్తుకొస్తాయి. కొన్నేళ్ళ పాటు జరిగిన ఈ యుద్ధాలు.. ఇప్పటికీ చరిత్ర పుటల్లో సజీవ సాక్షాలుగా నిలిచిపోయాయి. పెద్ద పెద్ద యుద్ధాల గురించి తెలిసిందే.. అయితే ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధం గురించి మీకు తెలుసా. కేవలం 38 నిముషాల పాటు జరిగిన ఈ యుద్ధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం మొత్తం ఈ అంశంపైనే చర్చించుకుంటోంది. మరోవైపు గతంలో జరిగిన యుద్ధాల గురించి కూడా గుర్తు చేసుకుంటున్నారు. యుద్ధం అంటేనే మనకు ముందుగా.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు గుర్తుకొస్తాయి. కొన్నేళ్ళ పాటు జరిగిన ఈ యుద్ధాలు.. ఇప్పటికీ చరిత్ర పుటల్లో సజీవ సాక్షాలుగా నిలిచిపోయాయి. పెద్ద పెద్ద యుద్ధాల గురించి తెలిసిందే.. అయితే ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధం గురించి మీకు తెలుసా. కేవలం 38 నిముషాల పాటు జరిగిన ఈ యుద్ధం.. ఏ దేశాల మధ్య, ఎప్పుడు, ఎందుకు జరిగిందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పెహల్గామ్ ఉగ్రదాడితో (Pahalgam Terror Attack) భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు (India-Pak war) నెలకొన్న విషయం తెలిసిందే. ఏ క్షణమైనా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ భయంతో వణుకుతున్నా కూడా.. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే.. ప్రపంచంలో గతంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఏ స్థాయిలో యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ యుద్ధ చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది.
ప్రపంచంలో ఎక్కవ రోజులు జరిగిన యుద్ధాలను పరిశీలిస్తే.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు (First and Second World Wars) సుమారు 4 నుంచి 6 సంవత్సరాల పాటు జరిగాయి. మరి అత్యంత తక్కువ సమయంలో జరిగిన యుద్ధాల విషయానికి వస్తే.. బ్రిటన్-జాంజిబార్ దేశాలు (Britain-Zanzibar War) గుర్తుకొస్తాయి. ఈ దేశాల మధ్య 1896 ఆగస్టు 27న యుద్ధం జరిగిందట. రాజకీయ వివాదాల కారణంగా ఈ యుద్ధం జరిగినట్లు తెలిసింది.
జాంజియార్ దేశాన్ని పర్యవేక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సయ్యద్ హమద్ బిన్ తువాయి అనే వ్యక్తిని నియమించింది. ఆయన ఆ దేశాన్ని శాంతియుతంగా పరిపాలించాడు. అయితే హమద్ ఆగస్టు 25న మరణించాడు. హమద్ మరణంతో అతడి మేనల్లుడు ఖలీద్ బిన్ బుర్గాష్ తనను తాను జాంజిబార్ సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. ఇది బ్రిటన్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వాస్తవంగా హమద్ స్థానంలో అతడి బంధువు హముద్ బిన్ మొహమ్మద్‌ను వారసుడిగా ప్రకటించాలని బ్రిటన్ భావించింది. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో ఖలీద్‌ను సుల్తాన పదవి నుంచి తొలగించాలని బ్రిటన్ ఆదేశించింది.
అయినా ఖలీద్.. బ్రిటన్ ఆదేశాలను పట్టించుకోలేదు. పైగా తన రాజ భవనం చుట్టూ సుమారు 3000 మంది సైనికులను మోహరించాడు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం చివరకు ఆగస్టు 27న జాంజియార్‌పై దాడి చేయాల్సి వచ్చింది. అయితే ఈ దాడితో భీతిల్తిన ఖలీద్ సైన్యం.. కేవలం 38 నిముషాల్లోనే యుద్ధం ముగించి లొంగిపోయారు. ఈ యుద్ధంలో ఖలీద్ సైన్యంలో సుమారు 500 మందికి పైగా గాయపడ్డారు. ఇలా ఈ యుద్ధం ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధంగా రికార్డుల్లోకి ఎక్కిందన్నమాట.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News
Updated Date - May 05 , 2025 | 12:26 PM