ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills by-election: లబ్.. డబ్.. జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ..

ABN, Publish Date - Nov 14 , 2025 | 06:36 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితంపై అందరిలో టెన్షన్‌ నెలకొంది. హోరాహోరీగా సాగిన ఓటింగ్‌లో విజయం ఎవరిని వరిస్తుందోనని అభ్యర్థులతో పాటు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

- ఓట్లెన్ని.. మెజారిటీ ఎంత?

- జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ.. ఓట్లెన్ని.. మెజారిటీ ఎంత?

- విజయావకాశాలపై ప్రధాన పార్టీల అభ్యర్థుల చర్చలు

- బూత్‌ల వారీగా కూడికలు.. తీసివేతలు

- మరికొద్ది సేపట్లో లెక్కింపు ప్రారంభం

- మధ్యాహ్నం వరకు ఫలితంపై ఉత్కంఠకు తెర

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఫలితంపై అందరిలో టెన్షన్‌ నెలకొంది. హోరాహోరీగా సాగిన ఓటింగ్‌లో విజయం ఎవరిని వరిస్తుందోనని అభ్యర్థులతో పాటు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయావకాశాలపై అభ్యర్థులు జోరుగా చర్చలు జరుపుతున్నారు. అయితే, మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఫలితం వెలువడనుంది.

హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజయావకాశాలు, వచ్చే ఓట్లు, మెజార్టీపై ప్రధాన పార్టీల అభ్యర్థులు తలమునకలయ్యారు. ఇప్పటికే పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ప్రకటించినా, అభ్యర్థులు రెండు రోజులుగా కూడికలు, తీసివేతలు మొదలుపెట్టారు. డివిజన్ల వారిగా పోలైన ఓట్లు కొంతమంది తీవ్ర ఒత్తిడికి గురవుతూ, దేవుళ్లను వేడుకుంటూ తమ అనుచరుల వద్ద పై విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

గతంలో కంటే ఈసారి జరిగిన ఎన్నిక తమకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయని గెలుపోటములు తమ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయంటూ దేవతామూర్తులను వేడుకుంటున్నారు. గెలిచిన తర్వాత మీ సన్నిధికి వచ్చి ముడుపులు చెల్లిస్తానమని పూజిస్తున్నట్లు తెలిసింది. కాగా, అభ్యర్థులతోపాటువారి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కూడా పూజల్లో నిమగ్నమవుతున్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం నమోదు ఇలా..

పోలింగ్‌ శాతం కేంద్రాలు

20-30 01

31-40 71

41-50 143

51-60 158

61-70 30

71-75 04

- 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్‌ నమోదైన 34 కేంద్రాల్లో 18 చోట్ల

మహిళలు

అధికంగా ఓటు వేశారు.

పోలింగ్‌ అత్యధికంగా నమోదైన 34 కేంద్రాల్లో ఏ డివిజన్‌లో ఎన్ని అంటే..

డివిజన్‌ పోలింగ్‌ కేంద్రాలు

రహమత్‌నగర్‌ 16

బోరబండ 13

షేక్‌పేట్‌ 02

ఎర్రగడ్డ 03

ఈ వార్తలు కూడా చదవండి..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

నేవీకి పూర్తి సహకారం

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 06:56 AM