Share News

CM Chandrababu: నేవీకి పూర్తి సహకారం

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:19 AM

నేవీ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.

CM Chandrababu: నేవీకి పూర్తి సహకారం

ఈఎన్‌సీ చీఫ్‌తో సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నేవీ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన సీఎంను తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ జిల్లాలో నేవీ ప్రాజెక్టులను సీఎంకు వివరించారు. రక్షణ రంగంలో నేవీకి ఉపయోగపడే కంపెనీలు, స్టార్ట్‌పలను రాష్ట్రానికి ఆహ్వానించే అంశాలపై చర్చ జరిగింది. త్వర లో నేవీ విశాఖలో నిర్వహించే ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ కార్యకలాపాల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. నేవీ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Updated Date - Nov 14 , 2025 | 06:20 AM